ఏపీ ఆర్టీసీ విలీనం.. తెలంగాణలో సమ్మెకు సై

Update: 2019-09-29 11:07 GMT
ఏపీ ఆర్టీసీని సీఎం జగన్ ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి సాహసోపేత మైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు పొరుగునే ఉన్న తెలంగాణ ఆర్టీసీలో కలకలం రేపాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీనీ కూడా  ప్రభుత్వంలో విలీనం చేయాలని.. మొత్తం 25 డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఆక్టోబర్ 5నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీనీ విలీనం చేయడంతోపాటు అన్ని విభాగాల్లో భర్తీ, వేతన సవరణ, కొత్త బస్సుల కొనుగోలుతో సహా ప్రభుత్వం ముందు 25 డిమాండ్లు తీర్చాలని కోరుతున్నారు.

సమ్మెపై నెల రోజుల కిందటే ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసు ఇచ్చారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ప్రజారవాణా వ్యవస్థ బతకాలంటే తమకు సహకరించాలని ప్రయాణికులను ఆర్టీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కేసీఆర్ సర్కారు ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహించారు.

కాగా సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ సంఘాలను అక్టోబర్ 4న కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. ఆ రోజు చర్చలు జరిపి సమ్మెకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Tags:    

Similar News