ఆటకు అందాన్ని జోడించినట్లుగా ఉండే టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటుంది. తల్లి అవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు సంవత్సరాల క్రితం టెన్నీస్ రాకెట్ ను పక్కకు పెట్టిన సానియా మళ్లీ ఇప్పుడు రాకెట్ పట్టేందుకు సిద్దం అయ్యింది. గర్బం దాల్చిన సమయంలో ఆమె మరీ ఎక్కువ బరువు పెరిగింది. డెలవరీ సమయంలో ఆమె ఏకంగా 86 కేజీల వరకు బరువు ఉందట. డెలవరీ అయిన తర్వాత కూడా ఆమె బరువు అలాగే ఉంటుందని అంతా భావించారు. 75 కేజీల కంటే బరువు తగ్గడం ఇక కష్టమే అని, దాంతో ఆమె మళ్లీ టెన్నీస్ ఆడదనే అభిప్రాయం అంతా వ్యక్తం చేశారు.
తన గురించి వచ్చిన కామెంట్స్ ను ఛాలెంజ్ గా తీసుకున్న సానియా మీర్జా డెలవరీ అయినా కొన్ని రోజులకే మెల్లగా వర్కౌట్స్ ప్రారంభించింది. కేవలం ఐదు నెలల్లో ఏకంగా 22 కేజీల బరువు తగ్గిందట. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జా చెప్పుకొచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని అంతా అనుకుంటారు. కాని నేను మాత్రం అలా కాదు, మళ్లీ రాకెట్ పట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. కష్టపడి తాను వర్కౌట్స్ చేసి బరువు తగ్గినట్లుగా చెప్పుకొచ్చింది. డెలవరీ సమయంలో చిన్న ఆపరేషన్ అయి, అది ఇబ్బంది పెడుతున్నా కూడా నేను జిమ్ మరియు డైటింగ్ చేసి బరువు తగ్గినట్లుగా చెప్పుకొచ్చింది. త్వరలోనే ప్రాక్టీస్ ప్రారంభిస్తానంటూ చెప్పుకొచ్చింది. మరి కొద్ది రోజుల్లోనే సానియా మీర్జాను అంతర్జాతీయ మ్యాచ్ సందర్బంగా కోర్టులో చూడవచ్చు అన్నమాట.