కెనడాకు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయర్ బౌచర్డ్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ మీడియాను విపరీతంగా ఆకర్షిస్తోంది. గడిచిన వారం రోజులుగా ఆమెకు సంబంధించిన వార్తలు ఇప్పుడు అన్ని మీడియా సంస్థలూ క్యారీ చేస్తున్నాయి. ఒక ఫుట్ బాల్ మ్యాచ్ చూసే క్రమంలో.. పరాజయం అంచున ఉన్న జట్టు కచ్చితంగా ఓడిపోతుందంటూ ఆమె ట్వీట్ చేయటం.. గెలిస్తే నాతో డేటింగ్ కు వస్తావా? అని ముక్కుముఖం తెలియని అభిమానం పందెం కట్టటం.. అందుకు ఆమె ఓకే అనేయటం.. అనూహ్యంగా ఆ మ్యాచ్ లో ఆమె ఓడిపోతారన్న జట్టు విజయం సాధించటం లాంటి సినిమాటిక్ సంఘటనలు చాలానే జరిగాయి.
దీంతో.. తాను ఇచ్చిన మాట ప్రకారం.. తనకేమాత్రం తెలీని వ్యక్తితో డేట్ కు ఆమెరెఢీ అయ్యింది. ఆ విషయం గురించి ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించింది. తర్వాత.. అతగాడితో తన డేట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. వీరి ముచ్చట హాట్ టాపిక్ గా మారింది. ఒక సాదాసీదా కుర్రాడితో.. ఒకస్టార్ సెలబ్రిటీ బెట్ ఓడిపోయి.. పందెంలో భాగంగా డేట్ కు ఓకేఅనటానికి మించిన విషయం ఏమి ఉంటుంది.
దీంతో.. ఈ న్యూస్ నుఅందరూ క్యారీ చేశారు. ఈ ముచ్చట ఇక్కడితో ముగిసిపోలేదు. తాజాగా ఆమెను కలిసిన మీడియా ప్రతినిధులు.. గుర్తుతెలీని వ్యక్తితో డేటింగ్ కు వెళ్లటం ఎలా అనిపించిందన్న ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చి.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ‘‘జాన్ జెంటిల్ మెన్. చాలా మర్యాదగా వ్యవహరించారు. అతనితో మరోసారి డేటింగ్ కు వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పేసింది. స్టార్ సెలబ్రిటీ తనకు తానుగా డేట్ కు వెళ్లాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తే.. సామాన్యుడైన జాన్ ఓకే అనకుండా ఉంటాడా? సో.. వీరిద్దరి సెకండ్ డేట్ ఫోటోలు త్వరలో రానున్నాయన్న మాట. ఈ డేట్ ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు వెళుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమో.. కొన్నిసార్లు గుర్రం ఎగరావచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/