జిహెచ్ ఎంసి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన ఆఫీసులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గన్ ఫౌండ్రీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు బీజేపీ కార్యాలయం వేదికైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గ్రేటర్ పీఠం అందుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకువేస్తుంది. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ గ్రేటర్ మేయర్ పీఠం పై కన్నేసింది. అయితే , బీజేపీ ప్రధాన కార్యాలయంలో గన్ ఫౌండ్రికి చెందిన శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ నెలకొంది. బీ ఫామ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్ పై.. శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తన భార్య డాక్టర్ సురేఖ తరఫున బీ ఫారం తీసుకునేందుకు ఓంప్రకాశ్ బీజేపీ కార్యాలయానికి రాగా, శైలేందర్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓంప్రకాశ్ కు టికెట్ ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగారు.కార్యకర్తలకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అన్యాయం చేస్తున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కార్యకర్తలు పరస్పరం కుర్చీలు కూడా విసురుకున్నారు. చాలా కుర్చీలు విరిగిపోయాయి. పలువురు కార్యకర్తల బట్టలు చిరిగిపోయాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలు విసిరేంత వరకు వెళ్లింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓం ప్రకాష్‌కి కార్పొరేటర్‌గా టికెట్ ఎలా ఇస్తారని గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ ప్రశ్నించారు.