సోషల్​మీడియా చాలెంజ్​ల వెనుక భయంకర కుట్ర.. తెలిస్తే షాక్​ అవుతారు!

Update: 2020-10-14 23:30 GMT
సోషల్​ మీడియాలో ఇటీవల ‘కపుల్​ చాలెంజ్​’ ‘టీనేజ్​ చాలెంజ్​’ ‘శారీ చాలెంజ్​’ అంటూ రకరకాల చాలెంజ్​లు పెరిగిపోయాయి. అయితే ఈ చాలెంజ్​ల వెనకు భారీ కుట్ర ఉన్నది. చైనాకు చెందిన కొన్ని అశ్లీల వెబ్​సైట్​లు ఈ చాలెంజ్​ల పేరుతో పెద్ద కుట్రలకు తెరలేపాయి. ఇటీవల ఓ యువతి కపుల్​ చాలెంజ్​ పేరిట తన భర్తతో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను ఫేస్​బుక్​లో షేర్​ చేసింది.  మరోసారి శారీ చాలెంజ్​ కోసం మరో ఫొటోను కూడా పెట్టింది. అయితే ఉన్నట్టుండి ఆమె ఫొటో చైనాకు చెందిన ఎఫ్ఏ చాట్ అనే ఒక కమర్షియల్ యాప్‌లో భర్తకు  కనిపించింది. ఆ ఫొటో కింద "నాతో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి" అంటూ రాసి ఉన్న ప్రకటన కూడా కనిపించింది. దీంతో ఆమె భర్త షాక్​కు గురయ్యాడు. శారీ చాలెంజ్​లో భాగంగా తన భార్య పెట్టిన ఫొటోను ఆ చైనా యాప్​ తీసుకున్నట్టు భర్త గుర్తించాడు.

 ఇలా చాలా మంది మహిళలు ఇటీవల ఈ సమస్యలను ఎదుర్కొన్నారు.  ఎవరి మీద ఫిర్యాదు చేయాలో.. ఆ యాప్​ ఏ దేశం కేంద్రంగా నడుస్తుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల శారీ చాలెంజ్​లో పాల్గొన్న ఓ టీవీనటి ఫొటో కూడా ఇటువంటి యాప్​లోనే దర్శనం ఇచ్చింది. “ఈ సెలబ్రిటీస్‌తో ఒక రాత్రి గడపాలనుకుంటే మాకు ఫోన్ చేయండి’ అటూ ఒక వెబ్‌సైటులో ఆమె ఫోటోలు కనిపించాయి. దీంతో ఆమె ఖంగుతిన్నది. దీంతో ఆమె ఫొటోలను భర్తకు చూపించింది. అయితే భర్త ఆ నంబర్​కు ఓ వినియోగదారుడిలా మాట్లాడారు.

అయితే అవతలి వ్యక్తి ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. మీకు కావాలంటే వేరే యువతిని అరేంజ్​ చేస్తాం అంటూ ఆఫర్​ ఇచ్చాడు. లేదు ఆ అమ్మాయే కావాలని ఆయన రెట్టించి అడగగానే, లేదు సర్, ఆ అమ్మాయి ఈ మధ్యనే మానేశారు. కావాలంటే వేరే వారు ఉన్నారు వాళ్లు జవాబిచ్చారు. చివరకు ఆయన పోలీసుల సాయంతో ఆ ఫొటోలను డెలిట్​ చేయించారు.“ నా భర్త నన్ను నమ్మకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  నిజానికి ‘శారీచాలెంజ్’ ‘కపుల్​ చాలెంజ్​​’ పేరిట వచ్చిన కొన్ని వేల ఫొటోలను వివిధ సైట్లు తీసుకున్నట్టు సమాచారం అందుతున్నది.

పోలీసులు ఏమంటున్నారు?
ఇటువంటి చాలెంజ్​లలో మహిళలు, యువతులు తమ ఫొటోలు పెట్టొద్దని పుణే సిటీ పోలీసులు ఇప్పటికే ట్విట్టర్​ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.  కపుల్ చాలెంజ్ గురించి ప్రత్యేకంగా ఏమీ ఫిర్యాదులు రాలేదని, పుణె సైబర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జైరాం పాయ్ గుడే చెప్పారు. ప్రొఫైల్ పిక్చర్లను వాడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులైతే వచ్చాయని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రజలను జాగ్రత్త వహించమని హెచ్చరించామని ఆయన చెప్పారు.

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏమంటున్నారు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఈ అంశంపై సంప్రదించగా ప్రత్యేకంగా కపుల్ ఛాలెంజ్ గురించి కేసులేవీ తమ దృష్టికి రాలేదని రాచకొండ పోలీస్ ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మామిళ్ళ చెప్పారు. వాస్తవానికి వ్యక్తిగత ఫోటోలు, సమాచారం దుర్వినియోగం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 67, 67 ఎ ప్రకారం కేసు పెట్టొచ్చు. అయినప్పటికీ మహిళలు, యువతులు ఈ చాలెంజ్​ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News