కశ్మీర్ ను విభజించి ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కలకలం రేపాయి. కశ్మీర్ లో సైన్యం మోహరించడం.. సరిహద్దుల్లో గట్టి కాపలా ఉండడంతో పాక్ ఉగ్రవాదులు దృష్టి మరల్చి కశ్మీర్ గుండా కాకుండా భారత పశ్చిమ తీరంలోని సముద్రం గుండా భారత్ లోకి ప్రవేశించారని కేంద్రం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజాగా దక్షిణభారత దేశంతోపాటు ముంబై, గుజరాత్ తీరాల్లో భారత నేవీని హై అలెర్ట్ చేశారు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలపై బీకర దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఆర్మీ కమాండర్ - లెఫ్ట్ నెంట్ జనరల్ సైనీ వెల్లడించారు. దీనికి సాక్ష్యంగా గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ వద్ద కొన్ని అనుమానాస్పద పాకిస్తాన్ పడవలను గుర్తించినట్టు సైనీ తెలిపారు.
దీంతో ముందస్తు చర్యగా గుజరాత్ - మహారాష్ట్ర - కేరళ - తమిళనాడు - ఏపీ తీరంలో భద్రతను తాజాగా నేవీ భారీగా పెంచింది. నిఘాను పటిష్టం చేసింది.
కాగా నేవి హెచ్చరికల నేపథ్యంలో కేరళ - మహారాష్ట్రలో బస్టాండ్ లు - తీరప్రాంతాలు - రైల్వే స్టేషన్లు - ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్ - ఆర్మీ ప్రస్తుతం దక్షిణాదిలో హై అలెర్ట్ ప్రకటించింది.
గుజరాత్ తీరంలోని సర్ క్రీక్ సంధి వద్ద ఖాళీ పాకిస్తాన్ బోట్లను భారత నేవీ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అందులో వచ్చిన ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం హైఅలెర్ట్ ప్రకటించారు.ఈ మేరకు అన్ని దక్షిణ భారత్ రాష్ట్రాల డీజీపీలు - ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.