అదానీ బొగ్గు గనితో ఆ బ్యాంకు తెగదెంపులు.. ఎందుకంటే

Update: 2021-11-09 06:34 GMT
అదానీ గ్రూపునకు, ఆ సంస్థకు ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్‌ బొగ్గు గనికి ఆర్థిక సేవలను అందించడం నిలిపివేయాలని అమెరికాకు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెలన్‌ కార్ప్‌ నిర్ణయం తీసుకుంది. ఆ గని పర్యావరణ, సామాజిక, పాలనా నిబంధనలకు లోబడి ఉండకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని చెప్పుకొచ్చింది. స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల అనంతరం దీనికి దూరంగా జరిగిన తాజా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఇదే.

అదానీ గ్రూప్‌ తో మా సంబంధాన్ని సమీక్షించాం. ఆస్ట్రేలియాలో ఆ సంస్థతో ఉన్న అన్ని లావాదేవీ ల నుంచి బయటకు వస్తున్నాం. అదనపు లావాదేవీలనూ పరిశీలించబోవడం లేదు అని ఆ బ్యాంక్‌ పేర్కొంది. బయటి రుణాలు రాకపోవడంతో అదానీ గ్రూప్‌ సొంతంగానే ఈ ప్రాజెక్టుకు కంపెనీ నిధులు సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది చివరకు తొలి షిప్‌ మెంట్‌ ను లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ, సామాజిక, పాలన నియమాలకు అదానీ ఆస్ట్రేలియా వెంచర్‌ విరుద్ధంగా ఉండడమే తన నిర్ణయానికి కారణమని చెప్పింది. స్థానిక ప్రజల ఆందోళనల నేపథ్యంలో తాజా నిర్ణయం జరిగింది.

16.5 బిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడి అంచనాతో 2010లో ఈ ప్రాజెక్టుకు అదానీ గ్రూపు ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత దీనిని 2 ఆస్ట్రేలియా బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభంలో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రతిపాదనలు చేసింది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావించింది.




Tags:    

Similar News