ఉత్తరాంధ్రలో పెద్ద చర్చగా మారిన ఆ నియోజకర్గం

Update: 2022-07-21 01:30 GMT
శ్రీకాకుళం రాజ‌కీయాల్లో మ‌ళ్లీ  కుల పోరు మొద‌ల‌యింది. వ‌ర్గ పోరు తీవ్రం అవుతోంది. ఇక్క‌డ ప్ర‌ధానంగా క‌నిపించే కాళింగ, కాపు వ‌ర్గాలే రూలింగ్ సెక్టార్ గా ఉన్నాయి. వీటితో పాటు వెలమ కూడా. ! ఈ మూడు కులాలూ ఎచ్చెర్ల రాజ‌కీయాల‌ను మ‌రింత ప్ర‌భావితం చేయ‌నుండ‌డ‌డం ఖాయం. ఆ వివరం ఈ క‌థనంలో..

ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు ముందు..ఎవ‌రు వెనుక అన్న టాక్ న‌డుస్తోంది. ముఖ్యంగా క‌ళా మ‌రియు గొర్లె వ‌ర్గాల మ‌ధ్య యుద్ధం న‌డుస్తోంది. సంక్షేమ రంగ ప‌రంగా వైసీపీ ముందంజ‌లో ఉంద‌ని, తాము ప‌ఠిస్తున్న మంత్రాన్నే టీడీపీ కూడా చెప్ప‌బోతోంద‌ని వైసీపీ అంటోంది. అయితే సీనియ‌ర్ నాయ‌కుడు అయిన క‌ళా వెంకట్రావు హ‌వాను ఇక్క‌డ ఎవ్వ‌రూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేరు. కానీ ఇంటి పోరు ను ఆయ‌న అడ్డుకోలేక‌పోతున్నారు అన్న చర్చ కూడా ఉంది.

తెలుగుదేశంలో క‌ళా వారసుడ్ని ఓన్ చేసుకోవ‌డం లేదు అన్న వాద‌న ఉంది. ముఖ్యంగా కిమిడి రామ్ మ‌ల్లిక్ నాయుడు  నాయ‌కుడిగా ఎదిగేందుకు ఉన్న దారులేవీ ఇంత‌వ‌ర‌కూ స్ప ష్టంగా కనిపించడం లేదు.  అధినేత చంద్ర‌బాబు కూడా పెద్ద‌గా ఆయ‌న్ను చేర‌దీయ‌డం లేద‌ని, ప్రోత్స‌హించ‌డం లేద‌ని కళా వర్గం అంటోంది.

ముఖ్యంగా లోకేశ్ లాంటి యువ నాయ‌కుల కోట‌రీలో గుర్తింపు పొంద‌ని వ్య‌క్తిగానే ఆయ‌న మిగిలిపోతున్నారు అన్న వాద‌న ఒక‌టి విన‌వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఎచ్చెర్లలో గ‌తంలో క‌న్నా గ్రూపు రాజ‌కీయాలు కూడా ఎక్కువ‌య్యాయి. ఉన్నంత‌లో ఓ డిగ్రీ కాలేజీ న‌డుపుకుంటూ జ‌నంలో మ‌మేకం అవుతూ ఓ స్థానిక ప‌త్రిక‌తో సత్సంబంధాలు న‌డుపుకుంటూ, సంబంధిత వ‌ర్గాల‌తో వ్యాపార లావాదేవీలు న‌డుపుకుంటూ వెళ్తున్న ఓ మాజీ జర్న‌లిస్టు కార‌ణంగా ఇక్క‌డ పెద్ద‌గా క‌ళా కొడుకు హవా న‌డ‌ప‌లేక‌పోతున్నారు.  ఆ మాజీ జ‌ర్న‌లిస్టు ఇప్పుడు  నియోజ‌క‌వ‌ర్గంలో అంతా తానై పోతున్నారు.  క‌నుక ఇక్క‌డ ఓట్లు చీల‌డం ఖాయం. అవి త‌ప్ప‌క వైసీపీ గెలుపున‌కు సహ‌క‌రిస్తాయ‌ని ఓ వ‌ర్గం జోస్యం చెబుతోంది.

మ‌రోవైపు కాళింగ, కాపు సామాజికవ‌ర్గాలు బలీయంగా ఉండే చోటు ఇదే కావ‌డంతో కాళింగుల నుంచి కూడా కళాపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉందని పరిశీలకుల మాట. ఇక్క‌డి కాళింగులలో కొంద‌రు ముఖ్యంగా చౌద‌రి బాబ్జీ వ‌ర్గం అంతా ఎర్ర‌న్న (వెల‌మ నేత‌) మ‌నుషులే! క‌నుక వీరంతా ఆధిప‌త్యం కోసం త‌పిస్తూ, క‌ళా రూలింగ్ ను ఒప్పుకోవ‌డం లేదు.

దీంతో ఇక్క‌డ ఈ సారి  కూడా కళాకు ఎదురుగాలి వీయ‌డం ఖాయ‌మే అంటున్నారు వారు! వైసీపీ అభ్య‌ర్థి బ‌లమన అభ్య‌ర్థి అయితే కాదు.. క‌నుక సిట్టింగ్ స్థానంలో ఉన్న కిర‌ణ్ ను మార్చి కొత్త వారిని ప్రోత్స‌హిస్తే ఆ విధంగా పోటీలో ఉన్న అభ్య‌ర్థి ముఖం మారిస్తే ఫ‌లితాలు బాగుంటాయి అని  అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఓటరు నాడి ఎటు వైపు తిరుగుతుందో మరి.
Tags:    

Similar News