అందుకే అర్థ‌రాత్రి బాబు ఇంటికి వ‌చ్చారా?

Update: 2019-06-26 10:04 GMT
త‌ప్పు జ‌రిగిన వెంట‌నే చెంప‌లేసుకుంటే అక్క‌డితో విష‌యం ముగుస్తుంది. అందుకు భిన్నంగా చేసిన త‌ప్పును క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తే.. త‌ప్పు మీద త‌ప్పు చేయ‌టం మిన‌హా మ‌రో అవకాశం ఉండ‌దు.  ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయం చేసే చంద్ర‌బాబు లాంటోళ్లు.. మారిన రాజకీయానికి త‌గ్గ‌ట్లుగా మార‌ట్లేద‌ని చెప్పాలి. తాజాగా ప్ర‌జావేదిక విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే.. అనుమానాలు క‌ల‌గ‌ట‌మే కాదు.. బాబు ఎప్ప‌టికి త‌న తీరు మార్చుకోర‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

అనుమ‌తులు లేని ప్ర‌జావేదిక‌ను కూల్చే వేళ‌లో అర్థ‌రాత్రి త‌న నివాసానికి బాబు ఎందుకు చేరుకున్న‌ట్లు?  కూలుస్తున్న ప్ర‌జావేదిక ప‌క్క‌నే ఉన్న త‌న ఇల్లు కూడా అనుమ‌తి లేనిదే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అక్ర‌మ నిర్మాణ‌మంతూ బాబు అద్దెకు ఉండే ఇంటికి నోటీసు ఇచ్చిన త‌ర్వాత కూడా విప‌క్ష నేత‌గా ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆయ‌న‌.. అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత అమ‌రావ‌తికి ఎందుకు చేరుకున్న‌ట్లు? అన్న సందేహానికి స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తాయి. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని ప్ర‌భుత్వం నోటీసులు ఇచ్చిన త‌ర్వాత కూడా ఖాళీ చేయ‌కుండా ఉండటాన్ని చూస్తే.. సానుభూతి కోసం క‌క్కుర్తి రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లుగా అనుమానం క‌లుగ‌క మాన‌దు.

తాను ఇంట్లో ఉండ‌గా అధికారులు తానున్న నివాసాన్ని కూల్చివేసే ప్ర‌య‌త్నం చేస్తే.. దానికి సానుభూతి క‌ల‌ర్ ఇవ్వ‌టం ద్వారా పొలిటికల్ మైలేజీ కోసం బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న సందేహం క‌లుగ‌క మాన‌దు. ఒక‌ప‌క్క అక్ర‌మ క‌ట్ట‌టం అన్న త‌ర్వాత కామ్ గా ఇంటిని ఖాళీ చేస్తే గౌర‌వ‌ప్ర‌దంగా ఉండేది. అందుకు భిన్నంగా వీలైనంత‌వ‌ర‌కు హ‌డావుడి చేసి పొలిటిక‌ల్ మైలేజీ తెచ్చుకునేందుకే అర్థ‌రాత్రి ఇంటికి చేరుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News