అంతకంతకూ పెరిగిపోతున్న ఇంధన ధరలను దృష్టిలో పెట్టుకొని చాలా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ వాహనాలకు వినియోగదారులు కూడా బ్రహ్మరథం పట్టడంతో వీటి కొనుగోళ్లు కూడా జోరందుకుంటున్నాయి.
గత కొంత కాలంగా చూస్తే విద్యుత్ తో నడిచే వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ వాహనాలు కేవలం భూమి మీద.. నీటి మీద మాత్రమే ఉండేవి. అయితే ఓ వాహన సంస్థ ఏకంగా విద్యుత్ తో నడిచే విమానాన్ని కనిపెట్టింది. దీనిని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించి... అనుకున్న విధంగా విజయం సాధించింది.
ది స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే పేరుతో ఖరీదైన కార్లను ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థ రోల్స్ రాయ్స్ ఈ విమానాన్ని రూపొందించింది ఈ ప్లేన్ మొదటిసారి నడపి ప్రపంచం రికార్డులను సొంతం చేసుకుంది.
అత్యంత వేగంగా ప్రయాణించే విమానం గా ఈ ప్లేన్ ప్రసిద్ధి చెందింది. దీని వేగం సుమారు గంటకు 623 కిలోమీటర్లగా ఉంటుంది. ఈ విమానాన్ని బ్రిటిష్ రక్షణ శాఖ కూడా విజయవంతంగా పరీక్షించింది. ఈ విమానాన్ని పరీక్షించే ఈ సమయంలో దీనిని ఆ సంస్థ ప్లేన్ ఆపరేషన్స్ డైరెక్టర్ నడిపారు.
ప్రజల జీవన స్థాయి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వారికీ విమాన ప్రయాణాన్ని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ విమానాన్ని రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఫ్లైయింగ్ ట్యాక్సీలను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఇంధనంతో నడిచే వాహనాల వల్ల ఇప్పటికే కాలుష్యం దెబ్బతిన్న కారణంగా... ఫ్లయింగ్ టాక్సీ ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. మూడు ప్రయాణ మార్గాలలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చింది పర్యావరణ హితంగా ఇవి ఉంటాయని గుర్తు చేసింది.
వేగంలో ఈ విమానం గతంలో ఉన్నటువంటి రికార్డులను బ్రేక్ చేసింది. పూర్తి స్థాయిలో విద్యుత్ తో నడిచే ఈ విమానం గంటకి 623 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఈ రికార్డ్ గంటకూ 225 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉన్నది ఈ విమానానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. కేవలం ఒక్క నిమిషం లోనే సుమారు మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఇది ఎగురుతుంది.
ఇది కూడా ప్రపంచ రికార్డు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది. సుమారు నాలుగు వందల కిలోవాట్ల పవర్ బ్యాటరీ ని ఇది కలిగి ఉంది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి విమానాలు మరిన్ని అందుబాటులోకి వస్తే డబ్బులు ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.