ఒక్కోసారి క్రికెట్ ఆటలో ఫన్నీ ఘటనలు జరుగుతూఉంటాయి. ఇటువంటి ఘటనలతో అభిమానులకు, టీవీ ప్రేక్షకులకు ఫుల్ కాలక్షేపం. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి స్టేడియం దాటిరోడ్డు మీద పడటం మనం చూస్తూ ఉంటాం. వాటిని తీసుకొనేందుకు కూడా కొందరు అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ అటువంటి ఘటనే ఒకటి జరిగింది. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి స్టేడియం దాటి బయట బీర్తాగుతున్న ఓవ్యక్తి గ్లాస్లో పడింది.
అయితే సదరు వ్యక్తి మాత్రం ఆ బీర్ అలాగే తాగిన తర్వాతే బంతిని ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్-10వ సీజన్ జరుగుతోంది. అక్కడ డేవిడ్ మలాన్ అనే ఇంగ్లండ్ జట్టు క్రికెటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి సిక్సు బౌండరీ అవతల పడింది. అయితే అది వెళ్లి ఓ యువకుడి బీర్ కప్‌లో పడింది. గ్లాసు ఒలకబోసి బాల్ ఇవ్వమని అంటే నో చెప్పి బీర్ తాగాకే బంతి తీసి ఇచ్చాడు.
జనవరి 2 శనివారం హోబర్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు బాదేశాడు.