పీకే స‌ర్వే ప్రారంభం.. వేటిపై దృష్టి పెట్టిందంటే...!

Update: 2021-10-07 01:25 GMT
వైసీపీ  రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు విశేషంగా కృషి చేసిన‌.. ఉత్త‌రా దికి చెందిన యువ నేత‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. మ‌రోసారి.. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిపో యారు. ``మ‌ళ్లీ పీకే వ‌స్తున్నారు. ఆయ‌న బృందం స‌ర్వే చేప‌డుతుంది. మీరు కూడా రెడీగా ఉండండి`` అని త‌న మంత్రివ‌ర్గానికి సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అంద‌రూ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే వాద‌న‌ను తీసుకువచ్చా రు. అయితే.. దీనిపై ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి ఎలాంటి స‌మాచారం లేక పోయినా..  ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారుపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

జ‌గ‌న్ ప్ర‌బుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోందని.. ఆయ‌న ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని.. క‌నీసం 15 స్థానాల్లో గెలిచినా గ్రేటేన‌ని.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా.. వైసీపీ విజ‌యం సాధిస్తోంది. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు.. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో గెలుపు గుర్రం ఎక్కుతోంది. పంచాయ‌తీ కావొచ్చు.. స్థానిక ఎన్నిక‌లు కావొచ్చు.. ప‌రిష‌త్ స‌మ‌రం కావొచ్చు.. తిరుప‌తి ఉప ఎన్నిక కావొచ్చు.. ఇలా ఏది తీసుకున్నా.. జ‌గ‌న్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఇంత సీన్ ఉండ‌ద‌ని.. తామే అధికారంలోకి వ‌స్తామ‌ని.. ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన‌-బీజేపీలు కూడా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి.

ఈ ప‌రిణామాల‌తో అస‌లు త‌న ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని త‌ర‌చుగా వ‌లంటీర్ల ద్వారా.. జ‌గ‌న్ సేక‌రిస్తున్నార‌నే స‌మాచారం ఉంది. అయితే.. ఇది కాదు.. పూర్తిస్థాయిలో పీకే టీంతోనే అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై దృష్టి పెట్టాల‌ని సీఎం భావించారు. ఈ క్ర‌మంలోనే పీకే టీంను రంగంలోకి దింపుతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రెండో రోజే... పీకే టీం సైలెంట్‌గా రంగంలోకి దిగిపోయింది. ప్ర‌స్తుతం వైసీపీ స‌ర్కారు పేర్కొంటున్న రాజ‌ధాని న‌గ‌రం విశాఖ‌లో ఈ బృందం ఇంటింటికీ తిరుగుతోంది. ఈ క్ర‌మంలో అనే విష‌యాల‌పై ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం సేక‌రిస్తున్నారు.

పీకే బృందం సంధిస్తున్న ప్ర‌శ్న‌ల్లో నేతల పనితీరు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అనే అంశాలు ఉన్న‌ట్టు తెలిసింది.  అలాగే ప్రభుత్వ అధికారులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరుపై సైతం ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటేడ్ పదవులు ఆశించిన భంగపడిన నేతలు నిరుత్సాహంలో ఉన్నట్లు పీకే టీం గుర్తించిందని సమాచారం.  కొందరికే పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు ఇవ్వడం లేదని పలువురు బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు మ‌రో రెండు బృందాలు రానున్నాయ‌ని స‌మాచారం. చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.
Tags:    

Similar News