చార్మినార్‌ - తాజ్‌ మహల్ అయినా మిగులుతాయా బీజేపీ ప్ర‌భుత్వంలో..!

Update: 2021-03-17 09:57 GMT
దేశంలో బీజేపీ ప్ర‌భుత్వం ఇప్పుడు అంతా కార్పొరేట్ల క‌బంద హ‌స్తాల్లో న‌లిగిపోతోంద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మోడీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ప‌లు ప్ర‌భుత్వ ఆస్తులు - ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్రైవేటీక‌ర‌ణ చేస్తూ పోతున్నారు. విలువైన జాతి సంద‌ప‌ను కార్పొరేట్ల ప‌రం చేసేస్తున్నారు. దీనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎన్ని ఉద్య‌మాలు జ‌రుగుతున్నా కూడా మోడీ ప్ర‌జ‌ల గొంతు నొక్కి మ‌రీ ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటు వాళ్ల‌కు త‌క్కువ రేట్ల‌కే ధారాద‌త్తం చేస్తూ పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్రోళ్ల‌కు ఎంతో సెంటిమెంట్ అయిన విశాఖ స్టీల్ క‌ర్మ‌గారాన్ని సైతం ప్రైవేటీక‌ర‌ణ చేసే దిశ‌గా శ‌ర‌వేగంగా ముందుకు వెళుతున్నారు.

చివ‌ర‌కు బీజేపీ ప్ర‌భుత్వ పాల‌న ఎలా ఉంద‌నేదానికి నిద‌ర్శ‌నంగా దేశ‌వ్యాప్తంగా ఓ నినాదం కూడా వైర‌ల్ అవుతోంది. మోడీ దేశాన్ని నార్త్‌ - సౌత్‌ గా విభ‌జించి నార్త్‌ ను అంబానీల‌కు - సౌత్‌ ను ఆదానీల ప‌రం చేసేస్తున్నార‌ని సెటైర్లు ప‌డుతున్నాయి. కేవ‌లం పారిశ్రామిక చ‌ట్టాల‌ను కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా మార్చ‌డ‌మే కాకుండా రైతుచట్టాలను కూడా ఆ శ‌క్తుల‌కు అనుకూలంగా మార్చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైత‌న్న నోట్లో మోడీ మట్టి కొడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ రైతు చ‌ట్టాలు అమ‌ల్లోకి వ‌స్తే రేప‌టి రోజున నిత్యావసర ధరల నియంత్రణపై ప్ర‌భుత్వం గ్రిప్ కోల్పోవ‌డ‌మే కాకుండా అది కూడా ఈ కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

చివ‌ర‌కు బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను - ప్ర‌జా సంప‌ద‌ను కార్పొరేట్ శ‌క్తుల‌కు అమ్మ‌డ‌మే లక్ష్యంగా దేశాన్ని పాలించేలా క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. ప్ర‌జా ఆస్తుల‌ను అమ్మేడ‌య‌మే ఓ దారుణం అనుకుంటే వాటి వాస్త‌వ విలువ‌లో 25 - 30 % విలువ‌కే వాటిని ప్రైవేట్ శ‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతుండ‌డం... అదేమ‌ని ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్కేయ‌డం మోడీ ప్ర‌భుత్వానికి రివాజుగా మారిపోయింది. దీనికి బ్రేక్ ప‌డ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల‌లోపే మ‌రి కొన్ని ప్రభుత్వ ఆస్తులు - ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు - కంపెనీలు కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లోకి వెళ్లిపోవ‌డ‌మే కాకుండా... చార్మినార్‌ - తాజ్‌ మహల్  కూడా అమ్మేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని జాతీయ మేథావులు - క‌ర్ష‌క‌ - కార్మిక సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.
Tags:    

Similar News