ఇండోనేషియాలో ఓ అరుదైన సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. ఓ చర్చిలో జరుగుతున్న పెళ్లికి వరుడు, వధువు అందంగా ముస్తాబై వచ్చారు. ఆ పెళ్లికి ఓ యువకుడు వచ్చాడు. ముందు వరుసలో కూర్చొని ఆ వధువును చూస్తూనే ఉన్నాడు. ఆ వధువు కూడా ఆ కుర్రాడిని చూస్తోంది.
చివరకు పెళ్లి జరగడానికి కొద్ది ముందు... వేదికపైకి ఆ యువకుడు రాగానే వధువు ఆగలేకపోయింది. తన భర్తను ఓ కోరిక కోరింది. ‘ప్లీజ్ ఇతడు నా మాజీ ప్రియుడు.. మన పెళ్లి జరగబోతోంది. ఆ తర్వాత అతడు నేను కలుసుకోలేను. కాబట్టి నేను ఒక్కసారి నా మాజీ ప్రియుడిని కౌగిలించుకోవాలనుకుంటున్నాను.. విత్ యువర్ పర్మిషన్’ అంటూ అడిగింది.
అయితే మన దేశంలో ఇలా వధువు అడిగితే పెళ్లి ఆపేసి వెళ్లిపోయే వరుళ్లు ఎంతో మంది ఉన్నారు.. పెళ్లిలో గొడవ చేసే వారు బోలెడు మంది.. సెకండ్ హ్యాండ్ అంటూ కొట్టేవారు కూడా ఉన్నారు. కానీ ఇండోనేషియా పెళ్లికొడుకు మాత్రం అలా చేయకుండా ఓకే అన్నాడు.
దీంతో తనకు కాబోయే భర్త ముందే మాజీ ప్రియుడిని కౌగించుకుంది ఆ వధువు. ఆ వరుడు కూడా మాజీ ప్రియుడిని దగ్గరకు తీసుకొని హగ్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెళ్లికూతురును తిడుతుంటే.. కొందరు పెళ్లి కొడుకు చేసింది రైట్ అంటున్నారు. ఎవరికి వారు కామెంట్లతో ఈ వీడియోను అయితే వైరల్ చేస్తున్నారు.
Full View