ఏపీలో మూడు రాజధానులు చేయాలని దాదాపుగా డిసైడ్ అయిన సీఎం జగన్ మే 6 నుంచి విశాఖ నుంచే పాలించాలని రెడీ అయ్యారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు మొగ్గుచూపుతోంది. ఈ ప్రక్రియ కోసం కేంద్రం వద్ద జగన్ సర్కార్ లాబీయింగ్ కూడా చేస్తోందన్న ప్రచారం సాగుతోంది.
తాజాగా కేంద్రప్రభుత్వం మరోసారి ఏపీ హైకోర్టు తరలింపుపై క్లారిటీ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
తాజాగా ఆర్టీఐ ద్వారా దాఖలైన పిటీషన్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు.ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంలో కేంద్రం పాత్ర ఏం లేదని.. హైకోర్టు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకొని దీనిపై నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందని తాజాగా సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్ కు కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు.
గతంలో పార్లమెంట్ వేదికగా కూడా కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు , రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపే పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే అంటున్నారు.