వైద్యుడిపై కుమార్తె చేసిన పనికి సారీ చెప్పిన సీఎం

Update: 2022-08-22 15:15 GMT
అధికారంలో నాన్న ఉన్నాడు.. పైగా సీఎం.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ ఖదర్ ఎలా ఉంటుంది. అదిరిపోయేలా ఉండదు.. తండ్రి సీఎం అని ఆ కూతురు ఓవర్ కాన్ఫిడెంట్ తో రెచ్చిపోయింది. రొచ్చు రొచ్చు చేసింది. ఆ కూతురు చేసిన పని సోషల్ మీడియాలో రచ్చ కావడంతో సీఎం పరువు పోయింది. కూతురు చేసిన పనికి తండ్రి అయిన సీఎం బహిరంగ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.

మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన కుమార్తె దురుసు ప్రవర్తన పట్ల స్పందించాడు. ఓ వైద్యుడిపై ఆమె దాడి చేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

మిజోరం రాజధాని ఐజ్వాల్ లో సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే ఇటీవల ఓ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అపాయింట్ మెంట్ లేకుండా తాను చూడనని.. క్లీనిక్ కు వచ్చేముందు అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందిగా డెర్మటాలజీ విభాగం వైద్యుడు తేల్చిచెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన చాంగ్టే క్లినిక్ లో అందరూ చూస్తుండగానే వైద్యుడి వద్దకు వెళ్లి అతడి ముఖంపై దాడి చేసింది.

అక్కడున్న కొందరు సీఎం కుమార్తె చేసిన వేశాలను ఫోన్ లో రికార్డ్ చేయడంతో ఆమె బండారం బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత రెండు రోజులుగా సీఎం పై , వారి కుమార్తెపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక వైద్య సంఘాలు కూడా మిజోరం శాఖ ఆధ్వర్యంలో నిరసనలు మొదలుపెట్టాయి. నిన్న వైద్యసిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీంతో చివరకు సీఎం జోరంతంగా తన కూతురు చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో విచారం వ్యక్తం చేశారు.ఐజ్వాల్ కు చెందిన డెర్మటాలజిస్ట్ తో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని.. ఆమె ప్రవర్తన ఏ విధంగా సమర్థనీయంగా లేదని పేర్కొంటూ తన చేతి రాతతో ఉన్న నోట్ ను షేర్ చేశారు.

Full ViewFull View
Tags:    

Similar News