కొవిడ్ కు చెక్ పెట్టేసే సాధారణ జలుబు.

Update: 2022-01-11 04:36 GMT
తీపి కబురు అంటే నిజమైన గుడ్ న్యూస్ గా దీన్ని చెప్పాలి. ముంచుకొచ్చేసిన మూడో వేవ్ వేళ.. కాసింత జలుబు చేసినా.. మరికాస్త ముక్కు కారినా.. ఇంకాస్త దగ్గు మొదలైనా సరే.. వెంటనే కరోనా వచ్చిందా? అన్నసందేహం.. దీనికి కాసిన్ని ఒళ్లు నొప్పులు యాడ్ అయితే.. నిజంగానే ఒమిక్రాన్ వచ్చేసిందన్న భావన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. బయటకు వచ్చిన ఒక అధ్యయనం అందరికిఅవగాహన పెంచటమే కాదు.. అనవసర భయాలకు చెక్ చెప్పేలా ఉందని చెప్పాలి.

కరోనా వైరస్ నుంచి టి కణాలు రక్షణ ఇస్తాయని చెప్పిన వైనం తెలిసిందే. అయితే.. ఈ వాదనలో నిజం ఉందన్న విషయం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలోనూ తేల్చింది. ఈ వివరాలు నేచర్ లో పబ్లిష్ అయ్యాయి. సాధారణ జలుబు ద్వారా డెవలప్ అయ్యే టి-కణాలు కొవిడ్ నుంచి రక్షణ అందిస్తాయని ప్రకటించింది. అధిక స్థాయిలో టి-కణాలు వైరస్ నుంచి రక్షణను అందించగలవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

కొవిడ్ 19 నుంచి సాధారణ జలుబు ఏ మేరకు రక్షణ కల్పిస్తుందన్న అంశంపై ఒక అధ్యయనాన్ని గత సెప్టెవబరులో ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ కు చెందిన అధ్యయనకారులు తమ అధ్యయనాన్ని షురూ చేశారు. ఇందులో భాగంగా సాధారణ జలుబుతో బాధ పడుతున్న 52 మందిని పరీక్షించారు. అప్పటికే కొందరిలో వైరస్ నిర్దారణ కాగా.. ఇన్ ఫెక్షన్ సోకని వారు కూడా ఉన్నారు.

వీరిలో కొవిడ్ కు గురైన వారితో పోలిస్తే.. వైరస్ కు గురి కాని 26 మందిలో టి-కణాలు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. సాధారణ జలుబు బారిన పడితే.. అలాంటి వారి శరీరంలో అధిక స్థాయిలో టి కణాలు పెరుగుతాయని.. వాటి కారణంగా కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రక్షించపడతామని గుర్తించినట్లుగా పేర్కొంది. అయితే.. ఈ రక్షణ ఎంత కాలం ఉంటుందన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదే అధ్యయనంలో మరో అంశాన్ని గుర్తించారు. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత యాంటీ బాడీ స్థాయిలు క్షీణిస్తున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటే.. టి కణాల రక్షణను అందించటంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఏమైనా.. మూడో వేవ్ వేళ.. జలుబుకు సంబంధించి వెలువడిన ఈ నిజం అందరిని కొత్త ధైర్యాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News