'గృహ సార‌థుల‌' తో ఓటు బ్యాంకు మారేనా...!

Update: 2022-12-17 02:30 GMT
వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. ఒక గొప్ప కాన్సెప్టును ఎర మీదికి తెచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం ద‌క్కిం చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. ఆయ‌న  ఇప్ప‌టికే అనేక అడుగులు వేస్తున్నారు. వీటిలో భాగంగా.. గృహ సార‌థులు అనే కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. ప్ర‌తి 50 ఇళ్లకు ఇద్ద‌రు చొప్ప‌న గృహ సార‌థులుగా ఎంపిక కానున్నారు. వీరిలోఒక‌రు మ‌హిళ కూడా ఖ‌చ్చితంగా ఉండ‌నున్నారు.

వీరంతా నిర్దేశిత స‌చివాలయ ప‌రిదిలో.. ప్ర‌జ‌ల‌ను క‌లిసి.. నిరంతరం వారికి బ్రెయిన్ వాష్ చేస్తారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి అనుకూలంగా ఓటు వేయించే బాధ్య‌త‌ల‌ను తీసుకుంటారు. ఎన్నిక‌ల సంఘం కూడా.. వీరిని అడ్డుకునే అవ‌కాశం లేన‌ట్టుగా.. వ్య‌వ‌స్థ‌ను తీర్చి దిద్దుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు ఏమేర‌కు ఓటు బ్యాంక‌ను మారుస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఎన్ని చెప్పినా.. చివ‌రి నిముషంలో వారు ఏం చేయాలో అదే చేస్తారు. అంత‌కుమించి వారిని మార్చే ప‌రిస్థితి ఉండ‌దు. ఇదే.. ఇన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌. అయితే, ఇప్పుడు వైసీపీ అధినేత మాత్రం కొత్త కాన్సెప్టుతో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. ఆస‌క్తిగా మారింది. అయితే, ఇది ఆయ‌న అనుకున్నంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. సంస్థాగ‌త ఓటు బ్యాంకును మార్చ‌డం.. ఎవ‌రిత‌ర‌మూ కాదు. అయితే, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తి రేక‌త‌ను మాత్రం మార్చేందుకు గృహ సార‌థులు ప్ర‌య‌త్నిస్తే.. కొంత వ‌ర‌కు వారు స‌క్సెస్ అయ్యేందుకు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు. అయితే, చివ‌రి నిముషంలో ఎలాంటి మార్పులు చోటు చేసు కున్నా.. ఈ కాన్సెప్టు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌ద‌ని వారు అంటున్నారు. ఇదే విష‌యం వైసీపీలోనూ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తి క‌ర‌ చ‌ర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News