ఇద్దరమ్మాయిల సహజీవనం కోర్టూ తేల్చలేకపోయింది!

Update: 2021-04-02 02:30 GMT
అబ్బాయి -అమ్మాయి ప్రేమించుకోవడం.. పెద్దలను ఎదురించి కోర్టులకు పోలీస్ స్టేషన్లకు ఎక్కడం కామన్. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. కలిసి జీవించారు. వారిని వారి తల్లిదండ్రులు విడదీయడంతో కోర్టుకెక్కారు. అదే ట్విస్ట్ ఇక్కడ.ఈ సున్నితమైన అంశంలో కోర్టు జాగ్రత్తగా వ్యవహరించింది. కోర్టు తీర్పుల సమగ్ర పరిశీలన తర్వాత అడుగు వేయాలని ఆదేశించింది.

మధురైకి చెందిన ఇద్దరు యువతులు తమ స్నేహ బంధాన్ని ప్రేమగా మార్చేసుకున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయారు. కలిసి జీవించాలని సిద్ధమయ్యారు. ఈ ఇద్దరి సహజీవనం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇద్దరి విడదీయడానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న జంట చెన్నైలోని స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది.

వారి ద్వారా మద్రాస్ హైకోర్టుకెక్కారు. తాము కలిసి జీవిస్తామని.. భద్రత కల్పిస్తామని విన్నవించారు. ఈ పిటీషన్ బుధవారం హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది.వాదనలు విన్న హైకోర్టు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ వ్యవహారంలో ఇదివరకు కోర్టు తీర్పులను పరిశీలిస్తున్నామని.. ఆ తర్వాత తీర్పులు ఇస్తామని పేర్కొన్నారు.
Tags:    

Similar News