అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లోకి డ్రాగన్ దేశం చొచ్చుకుని వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దుల నుండి సుమారు 5 కిలోమీటర్ల లోపలకు చైనా సైన్యం చొచ్చుకుని వచ్చేసింది. ఈ విషయం ఎన్డీటీవీ విడుదల చూసిన శాటిలైట్ ఫొటోల్లో స్పష్టంగా కనబడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమదిగా చైనా ఎప్పటి నుండో చెప్పుకుంటోంది. ఈ విషయమై గతంలో చాలాసార్లే రెండు దేశాల మధ్య వివాదాలు కూడా రేగాయి.
అయితే పట్టువదలని విక్రమార్కుడిలాగ పదే పదే అరుణాచల్ వైపు నుండి మనదేశంలోకి చొచ్చుకుని రావటానికి డ్రాగన్ చేయని ప్రయత్నంలేదు. కొద్దిరోజులుగా హిమాలయ పర్వంత ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల చలుంటుంది. దాన్ని అనుకూలంగా చేసుకున్న చైనా కొద్దిరోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాలో వివాదాస్పద ప్రాంతంలో చైనా ఏకంగా 102 ఇళ్ళను నిర్మించేసింది.
2019 నవంబర్-2020 నవంబర్ ప్రాంతాలకు చెందిన శాటిలైట్ ఫొటోలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. చైనా నిర్మించిన ఇళ్ళు కూడా తాజాగా నిర్మించినవే అన్న విషయాన్ని స్ధానికులు చెబుతున్నారు. డ్రాగన్ దేశం మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి ఏకంగా ఇళ్ళని నిర్మించేసినా మన అధికారులు మాత్రం నోరిప్పకపోవటం విచిత్రంగా ఉంది.
డ్రాగన్ చాలాకాలంగా మన భాభూగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని స్ధానిక బీజేపీ ఎంపి టాపిర్ గావ్ ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. స్ధానికంగా ఉన్న ఓ నదీతీరం వెంబడే మన భూభాగాన్ని ఆక్రమించుకుని చైనా గ్రామాలను నిర్మించేస్తోందని ఎంపి ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులెవరు నోరిప్పకపోవటం గమనార్హం. మరి ఎంపి ఆరోపణలను తాజాగా ఎన్డీటీవీ ప్రసారం చేస్తున్న నేపధ్యంలో ఏమైనా కదలిక వస్తుందేమో చూడాలి.