ముగిసిన నామినేషన్ల ఘట్టం

Update: 2021-01-31 14:11 GMT
ఏపీలో పంచాయితీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. తొలిరోజు తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. ఆఖరిరోజున ఇవాళ భారీగా నామినేషన్లు వచ్చాయి.

రేపు అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

వచ్చే నెల 9న తొలిదశ ఎన్నికలకు ఉ 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తొలి దశ పోలింగ్ జరుగనుంది. సాయంత్రం నుంచి ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.

తొలి దశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు వెలువడతాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2న నోటిఫికేషన్‌ వెలువడనుంది.

ఈరోజు దాఖలైన నామినేషన్లు, మొత్తం వివరాలను మరికొంత సేపట్లో ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.




Tags:    

Similar News