సీఎంతో మాట్లాడే వేళలో ఆ మహిళా ఎంపీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదట!

Update: 2021-03-27 09:51 GMT
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తుంటారు శివసేన నేతలు. తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేసేసి అడ్డంగా బుక్ అయిపోతుంటారు. తాజాగా అలాంటి పనే చేసిన ఒక ఎంపీ కారణంగా.. ఇప్పుడా పార్టీని తీవ్రంగా తప్పు పట్టేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. సినీ నటిగా సుపరిచితురాలు.. ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారి ఓడినప్పటికీ.. రెండోసారి రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన నవనీత్ కౌర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రాజకీయాల్లో ఉన్న భర్తకు ఏ మాత్రం తీసిపోని రీతిలో నవనీత్ కౌర్ సైతం మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గంనుంచి ఎంపీగా గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినా.. గెలిచేందుకు కారణం ఆమె పడిన శ్రమ మాత్రమే. పంజాబీ అయినప్పటికీ మహారాష్ట్రలో సెటిల్ అయిన నవనీత్ కౌర్.. పలు తెలుగు సినిమాల్లో నటించారు. అలాంటి ఆమెపై శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట జారారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడే సమయంలో నవనీత్ బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆమె.. అంతే ఘాటుగా బదులిచ్చారు. ఆడవాళ్ల బాడీలపై ధ్యాస తగ్గించి.. నీ లాంగ్వేజ్ సరి చేసుకో అని మండిపడ్డారు.  అంతేకాదు.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడేటప్పుడు మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నేర్పితే నేర్చుకుంటామని ఘాటైన వ్యంగ్య వ్యాఖ్య చేశారు.

తనను తప్పు పట్టిన అరవింద్ సావంత్ మీద ఆమె కాళికలా విరుచుకుపడ్డారు. మనుషుల చేత ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడని.. జైల్లో తోయిస్తానని అంటున్నాడని.. ఆసిడ్ దాడులు జరుగుతాయని బెదిరింపులకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. వీటిపై ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు. తనను తప్పు పట్టే వారి విషయంలో అంతే ధీటుగా వ్యవహరిస్తున్న నవనీత్ తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కీపిటప్ నవనీతా.
Tags:    

Similar News