తొలి రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. 4వ స్థానంలో వచ్చినా కలిసిరాలేదు. ఇక మరోసారి మ్యాచ్ లో ఆడకపోతే అతడి పై పెట్టిన 13 కోట్లు వృథా అని యాజమాన్యం కూడా ఆశలు వదిలేసింది. వాళ్ల తల్లిదండ్రులు కూడా కొడుకు ఆడకపోవడంతో లండన్ వెళ్లిపోయారు. కానీ అతడి గర్ల్ ఫ్రెండ్ మాత్రం వదల్లేదు. నమ్మకం ఉంచి అతడితోపాటే ఉంది. అతడి నైతిక స్థార్యాన్ని పెంచింది. దీంతో ఐపీఎల్ లోనే తొలి సెంచరీ బాదేశాడు హారీ బ్రూక్. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడికి వెన్నుదన్నుగా నిలబడ్డది ఆయన గర్ల్ ఫ్రెండ్ అతడే పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో చెప్పుకొచ్చాడు. దీంతో ఈమె ఎవరు? ఆమె కథ ఏంటి? అని తెలుసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇటీవల వేలంలో ఇంగ్లండ్ తరుఫున దంచికొడుతున్న హ్యారీ బ్రూక్ ను 13 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అతడికి ఇదే తొలి ఐపీఎల్. వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. స్పిన్ ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే మూడో మ్యాచ్ లోనే సెంచరీ చేసి సన్ రైజర్స్ ను గెలిపించాడు. అయితే అతడి గెలుపు వెనుక ఉన్నది అతడి గర్ల్ ఫ్రెండ్ అని తర్వాత తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి సీజన్ ఆడుతున్న బ్రూక్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో తన మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 29 పరుగులు చేశాడు. అయితే, నాలుగో మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన బ్రూక్ తన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. బ్రూక్ ను 13.25 కోట్లు పెట్టి కొన్నందుకు సన్ రైజర్స్ కు న్యాయం చేశాడు. గత సంవత్సరం ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళలో ఒకరిగా హారీ బ్రూక్ ను పరిగణించారు. ఇప్పుడు ఆ డబ్బుకు తగ్గ ఆటను హారీ ఆడేశాడు. ఈకుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో కోల్ కతాపై 100* (55 బంతుల్లో) పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 228/4 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ యొక్క రెండవ అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు ఇదే కావడం గమనార్హం.
మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. 'సెంచరీ చేయడానికి ముందు తన కుటుంబ సభ్యులంతా వెళ్లిపోయారని.. తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉందన్నాడు. వారు వెళ్లాక తాను పరుగులు చేస్తానని అనుకున్నానని..తాను సెంచరీ చేయడం పట్ల వారు కూడా సంతోషిస్తారని ' అన్నాడు.
హ్యారీ బ్రూక్ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు 'లూసీ'. గత రెండేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. గతంలోనూ బ్రూక్ ఆట చూసేందుకు లూసీ స్టేడియానికి వచ్చిన సందర్భాలున్నాయి. ఆమెతో దిగిన ఫొటోలు బ్రూక్ అకౌంట్లో ఉన్నాయి. అయితే లూసికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు తెలియవు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా కూడా ప్రైవేటులో ఉంది. దీంతో లవర్ కోసమే మనోడు సెంచరీ చేసినట్టు ఉందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.