ఒకే ఊపిరితిత్తితో క‌రోనాను త‌రిమేసిన బాలిక‌!

Update: 2021-06-26 00:30 GMT
క‌రోనా సోకితే ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపించేది లంగ్స్ మీద‌నే అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం ఊపిరి ఆడ‌క‌నే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ.. ఓ బాలిక మాత్రం ఒకే ఒక ఊపిరితిత్తితో క‌రోనాను ఎదుర్కొంది. అంతేకాదు.. ఆ బాలిక‌కు ఇంకా ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. అయినప్పటికీ.. కేవ‌లం 12 రోజుల్లోనే ఆ మ‌హ‌మ్మారిపై యుద్ధం గెలిచింది.

ఇండోర్ కు చెందిన ఆ బాలిక పేరు సిమి. వ‌య‌సు 12 సంవ‌త్స‌రాలు. పుట్టుక‌తోనే ఆమెకు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఒక చేయి లేకుండానే పుట్టింది సిమి. ఆ త‌ర్వాత కాల క్ర‌మంలో ఒక ఊపిరితిత్తి కుంచించుకుపోయింది. కిడ్నీలు కూడా స‌రిగా డెవ‌ల‌ప్ కాలేదు. ఇలాంటి ఎన్నో కాంప్లికేష‌న్స్ న‌డుమ జీవితం కొన‌సాగిస్తోంది సిమి.

ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిమికి.. గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాలుగా రాత్రిపూట ఆక్సీజ‌న్ అందిస్తున్నారు. అంటే.. క‌రోనా పుట్ట‌క ముందు నుంచే ఆమె ఆక్సీజ‌న్ తో జీవనం సాగిస్తోంది. అలాంటి సిమిపై క‌రోనా దాడిచేసింది. మామూలు స‌మ‌యాల్లోనే ఆమెలో ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ 60 శాతానికి ప‌డిపోతాయి. అందుకే రాత్రివేళ ఆక్సీజ‌న్ ఇస్తారు. అలాంటి క‌రోనా దాడి చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది?

కానీ.. ఈ మ‌హ‌మ్మారి సిమిని ఏమీ చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం ప‌న్నెండు రోజుల్లోనే వైర‌స్ ను త‌న్ని త‌రిమేసింది. ధైర్యంగా కొవిడ్ ను ఎదుర్కొన‌డం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని అంటున్నారు వైద్యులు. ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌నిపోయిన వారిలో చాలా మంది భ‌యంతోనే ప్రాణాలు కోల్పోయార‌న‌డానికి సిమి ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందేమో క‌దా?
Tags:    

Similar News