ఒక వీడియో ఇప్పుడు భారీ ఎత్తున వైరల్ అవుతోంది. పండుగ వేళ.. రోటీన్ కు భిన్నంగా ముక్క లేనిది ముద్ద దిగనోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. కానీ.. తాజా వీడియో చూసిన తర్వాత.. తామెంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ ఆలోచనను మార్చుకుంటున్న వైనం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. పండుగ వేళలో టర్కీ కోడి కూరను తినే అలవాటున్న ప్రాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్న వైనం కొత్త చర్చకు తెర తీస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
అమెరికాలో అందరూ పెద్ద ఎత్తున జరుపుకునే ‘థ్యాంక్స్ గివిండ్ డే’ వేళ.. మనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకునే రోజుగా చెబుతారు. ఈ రోజును వేడుకగా జరుపుకోవటంతో పాటు.. తమకుసాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పటమేకాదు.. వారికి బోలెడన్ని బహుమతులు ఇవ్వటం.. ఇష్టమైన ఆహారపదార్థాల్ని తినటం లాంటివి చేస్తుంటారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటారు.
ఈ రోజున.. టర్కీ కోడి మాంసాన్ని ఇష్టంగా తినటం కూడా ఉంటుంది. అలాంటిది ఒక టర్కీ కోడి వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా చూపుతున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ చిట్టి వీడియోను చూసినప్పుడు.. టర్కీ కోడి ఏడ్చినట్లుగా కంటే కూడా.. దాని యజమాని దానికి చెబుతున్న మాటలకు.. సాంత్వన పొందుతున్న వైనం మాత్రం కనిపించక మానదు. ఒక వ్యక్తి ఒడిలో పక్షి తలపెట్టుకొని సాంత్వన పొందుతున్న వీడియోను జంతు పరిరక్షక కార్యకర్త జాన్ ఓబర్గ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా టర్కీ కోడిని వండుకు తినాలనుకుంటున్న వారు.. తాను పోస్టు చేసిన వీడియోను చూడాలని కోరారు. ఈ వీడియో చూశాక.. టర్కీ కోడి భోజనాన్ని చేయాలన్న ఆలోచనను విరమించుకోవచ్చన్న వ్యాఖ్యలకు తగ్గట్లే.. పలువురు స్పందించటం గమనార్హం. అయితే.. వీడియోలో టర్కీ కోడికి సాంత్వన వచనాలు చెబుతున్న వ్యక్తి వివరాలు బయటకు రాలేదు. ఈ వీడియోను చూసిన పలువురు..తాము నాన్ వెజ్ ను ముట్టుకోమని మాట ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి వాటిని పిచ్చ లైట్ గా తీసుకొని.. తాము లాగించాలనుకున్న నాన్ వెజ్ డిషెస్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు.

If everyone who was planning on eating #turkey for #Thanksgiving tomorrow saw this, MANY of them would leave them off their plates. Pls RT!