ఇంటి అడ్రెస్ ను చెప్పిన తీరుకు ఫిదా కావాల్సిందే

Update: 2021-02-26 00:30 GMT
తెలివి ఎవరి సొంతం కాదు. కానీ.. కొందరు అనుసరించే మార్గాలు పలువురికి కొత్త స్ఫూర్తిని ఇవ్వటమే కాదు.. పలువురు ఫాలో అయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో జీవనశైలిలో చాలానే మార్పులు వచ్చేశాయి. ఫుడ్ దగ్గర నుంచి రోజువాడే వస్తువులు.. కూరగాయలు.. పండ్లు.. మందుతు.. టీవీలు.. ఫ్రిజ్ లు ఇలా ఒకటి కాదు రెండు కాదు.. డెలివరీకి సంబంధించి సేవల్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. మహానగరాల్లో ఇంటి అడ్రస్ ను గుర్తించటం అంత ఈజీ కాదు.

ఇలాంటి సమస్యలకు తెలివైన పరిష్కారాన్ని ఆలోచించాడో యువకుడు. రాత్రి వేళ తన ఇంటిక డెలివరీ కోసం వచ్చే అబ్బాయి.. తాను ఉన్న లోకేషన్ ఎక్కడో చెప్పాడు. చెప్పినంత తేలిగ్గా ఇంటిని కనుక్కోవటం కష్టం. అదే తరహాలో డెలివరీ బాయ్ కిందా మీదా పడుతుంటే.. సదరు వినియోగదారుడు తెలివైన పని చేశాడు. తన దగ్గరి బ్లూ బీమ్ లైట్ ను వాడాడు. తాను ఉన్న ప్లేస్ నుంచి డెలివరీ బాయ్ ఉన్న చోటు వరకు ఈ బీమ్ లైట్ ను వినియోగించాడు.

మొదట్లో దీన్ని గుర్తించటం కష్టమైనా.. తర్వాత ఇంటికి గుర్తించాడు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను తినేశాడు. ఇదే విషయాన్ని ట్విటర్ లో పేర్కొన్నాడు. ఈ మొత్తం ఉదంతాన్ని ఎస్పీఎక్స్ సీ అనే వ్యక్తి ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఇది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. బ్లూ లైట్ పట్టుకున్న వ్యక్తిపై విపరీతంగా ప్రశంసలు తక్కుతున్నాయి. మీకు ఇలాంటి తెలివి తేటలు ఎలా వస్తాయన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం.
Tags:    

Similar News