నా భార్య కడుపులోని బిడ్డకు తండ్రిని నేను కాదు.. సీమంతంలో షాక్​ ఇచ్చిన భర్త..

Update: 2020-11-08 15:30 GMT
స్త్రీలకు సంబంధించిన వేడుకల్లో సీమంతం చాలా ముఖ్యమైనది. ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేయడానికి సీమంతం వేడుకను వాడుకున్నాడు. బోలివియాకు చెందిన ఓ జంటకు పెళ్లైయి ఐదేండ్లు గడిచింది. భార్యభర్తలు కొంతకాలంపాటు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత భార్య తప్పుడు దారిలోకి వెళ్లిపోయింది. భర్తను కాదని తన కుటుంబానికి తెలిసిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. వీరిద్దరిపై ఆ భర్తకు అనుమానం వచ్చింది. దీంతో గట్టి నిఘాపెట్టి వారి సంబంధాన్ని ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. భార్య గర్భవతి అని తేలడంతో.. తన వల్ల కాలేదని అతడికి అనుమానం వచ్చింది. దీంతో భార్యకు తెలియకుండా ఆమెకు డీఎన్​ఏ పరీక్ష చేయించాడు. అతడి అనుమానమే నిజమైంది. సదరు ఫ్యామిలీ ఫ్రెండ్​వల్లే భార్య గర్భవతి అయిందన్ని నిర్ధారించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన మెడికల్​ రిపోర్టులను సేకరించిపెట్టుకున్నాడు. దీంతో పాటు తన భార్య , ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను, వీడియోలను కూడా తీసిపెట్టుకున్నాడు. సీమంతం వేడకకు భార్య ప్రియుడిని కూడా ఆహ్వానించాడు. అక్కడే వీరి రాసలీలను, ఆస్పత్రి రిపోర్టులను బంధువులందరికీ చూపించాడు. దీంతో బంధువులు సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు మాత్రం భార్యను ఏలుకోలేనంటూ తేల్చిచెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నది.
Tags:    

Similar News