జయదేవ్ ఉనాద్కత్… ఐపీఎల్ ఇతడొక సుడిగాడు. తన బోటి పేస్ బౌలర్లు చాలా మందే ఉన్నా వారందరి కన్నా చాలా ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్ ఇతడు. ఒకసారి కాదు.. రెండు మూడు సీజన్లలో ఇతడిని అదృష్ట లక్ష్మి వరించింది.
ఎనిమిది కోట్ల రూపాయల ధర కు పైగా ఒకసారి, పదకొండు కోట్ల రూపాయల ధరకు పైగా మరోసారి వేలంలో అమ్ముడయ్యాడు ఉనాద్కత్. కోటిన్నర రూపాయల బేస్ ప్రైజ్ నుంచి ఆ ధర వరకూ వెళ్లింది ఇతడి రేంజ్.
వేలం లో అలా భారీ ధరల కు అయితే అమ్ముడయ్యాడు కానీ, ఆటలో మాత్రం ఆ స్థాయిని చూపించ లేకపోయాడు ఉనాద్కత్. ఫలితంగా భారీ ధరకు కొనుగోలు చేసిన వారే ఇతడిని వదులుకుంటూ ఉన్నారు.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉనాద్కత్ ను వదులుకుంది. పదకొండు కోట్ల రూపాయలు పెట్టి మరీ ఇతడి ని కొనుగోలు చేసిన ఈ జట్టు అతడిని వదులుకుంది. మళ్లీ వేలానికి వెళ్లాల్సి ఉంది ఉనాద్కత్ పేరు. మరి ఉనాద్కత్ కు ఈ సారి ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తి దాయకంగా మారింది.
అలాగే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ముంబై జట్టు వదులుకుంది. కోటి రూపాయలే అయినప్పటికీ యువరాజ్ ను ఆ జట్టు వదలుకుంది. ఈ మాజీ పేరు కూడా ఇప్పుడు వేలం జాబితాలోకి ఎక్కింది. ముప్పై ఏడేళ్ల యువరాజ్ ను ఎవరు కొనుగోలు చేస్తారనేది కూడా ఆసక్తిదాయకమైన అంశమే.