ఈ ఏడాది స్కూళ్లకు బైబై చెప్పడమేనా?

Update: 2020-07-15 04:00 GMT
చైనా నుంచి ఊడిపడ్డ కరోనా మహమ్మారి దెబ్బకు అంతా బంద్ అయిపోయింది. చదవులు అయితే అటకెక్కాయి. మూడు నెలలు దాటినా బడిగంటలు మోగేలా కనిపించడం లేదు. ఎప్పుడు తెరుస్తాయో కూడా తెలియని పరిస్థితి. కరోనా తగ్గేదెప్పుడు..? స్కూళ్లు తెరిచేదెప్పడు? విద్యార్థులంతా ఆందోళనగా ఉన్నారు. ఆన్ లైన్ క్లాసులు ప్రత్యామ్మాయం కాదనే వాదన అందరిలోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఈ చదువుల సంవత్సరాన్ని ‘జీరో ఇయర్’గా ప్రకటించింది. కేంద్రం, తెలుగు రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

అన్ లాక్ దేశంలో ప్రారంభమైనా కేసులు తగ్గడం లేదు. జెట్ స్పీడుతో పరిగెడుతున్నాయి. దీంతో ఏదైనా అద్భుతం జరగాలి.. లేదా వ్యాక్సిన్ రావాలి. అప్పుడే స్కూళ్లు తెరుస్తారు. ఇవి రెండు జరిగేలా లేవు. దీంతో 2020-21ను ‘జీరో’ విద్యా సంవత్సరంగా మార్చాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రంలోని యూజీసి కూడా ఇదే ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఈ జీరో ఇయర్ గా ప్రకటిస్తే సిలబస్ ను 50శాతం తగ్గిస్తారు. తరగతులు పనిదినాలను కుదించి విద్యాసంస్థలను నిర్వహిస్తారు. ఈ ఆచరణ సాధ్యాసాధ్యాలపై యూజీసీ తర్జన భర్జన పడుతోంది. అయితే స్కూళ్లు తెరిచినా పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేరు. వర్షకాలం, శీతాకాలంలో కరోనా మరింత విజృంభిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు స్కూళ్లకు అస్సలు పంపరు.

ఇప్పటికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్ రూపొందించలేదు. కర్ణాటక ప్రభుత్వం ఏకంగా ఈ విద్యా సంవత్సరాన్ని రద్దు చేసింది. అదే దిశగా తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి.

ఇక ఆన్ లైన్ విధానాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం వారి నైపుణ్యాలను తొక్కేసినట్టే అవుతుందని మేధావుల అభిప్రాయం. అందుకే ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. వైరస్ కట్టడిపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందంటున్నారు.
Tags:    

Similar News