గాంధీజీ చివరి 13.47గంటల్లో ఏం జరిగింది..?

Update: 2016-01-30 07:09 GMT
తాను నమ్మిన సిద్దాంతం కోసం తన జీవితం మొత్తం పోరాడిన వ్యక్తి జాతిపిత మహాత్మ గాంధీ. కోట్లాది మంది భారతీయుల స్వాతంత్ర్య కలను సాకారం చేసిన అద్భుత వ్యక్తి. మరికొన్నేళ్ల తర్వాత ఈ భూమండలం మీద ఇలాంటి వ్యక్తి ఒకరు నడిచారా? అన్న ప్రశ్న భవిష్యత్తు తరాలు వేసుకునే అవకాశం ఉందంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ బర్ట్ ఐన్ స్టీన్ లాంటి వ్యక్తి గాంధీని కీర్తించారంటే ఆయన మహోన్నత వ్యక్తిత్వం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సుమారు ఐదు నెలల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు పోయాయి. ఆయన్ను కాల్చి చంపిన దుర్మార్గం జనవరి 30.. 1948లో చోటు చేసుకుంది. జాతిపిత ఊపిరి ఆగిన ఆ రోజు ఏం జరిగిందన్నది చూస్తే..

= ఉదయం 3.30 గంటలకు నిద్ర లేచిన ఆయన.. తన కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనలు చేశారు

= ఉదయం ఆరు గంటల సమయంలో నెహ్రూ మేనల్లుడు రతన్ కుమార్ సతీమణి రంజన్ జాతిపితను కలుసుకొని మాట్లాడారు

= ఉదయం 9.30 గంటల సమయంలో జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ ముసాయిదాను పరిశీలించి.. ఉదయం భోజనం చేశారు

= మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లైఫ్ మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్ మార్గరెట్ బోర్క్ వైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు

= సాయంత్రం 4 గంటల సమయంలో జాతిపితను సర్దార్ పటేల్.. ఆయన కుమార్తె వచ్చి కలిశారు

= సాయంత్రం 4.30 గంటలకు సాయంత్రం ఉపాహారం పూర్తి చేశారు

= సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో పటేల్.. ఆయన కుమార్తెతో బిర్లా హౌస్ కు బయలుదేరారు

= సాయంత్రం 5.15 గంటలకు మేనకోడళ్లు మను.. అభాలతో కలిసి బిర్లా హౌస్ లో ప్రార్థన సమావేశానికి వచ్చారు

= సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల సమయంలో నాథూరాం గాడ్సే తన వద్దనున్న పిస్టల్ తో కాల్పులు జరిపారు. పిస్టల్ నుంచి దూసుకొచ్చిన మూడు బుల్లెట్లతో గాంధీ మహాత్మకుడు అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ పరిణామంతో దేశం మొత్తం రోదించింది.
Tags:    

Similar News