వైసీపీని జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నట్లుగా ఏకపక్ష విజయాలే అన్నీ దక్కుతున్నాయి. ఒక విధంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అవుతున్నా కూడా వరసబెట్టి గెలుపే గెలుపు అన్నట్లుగా సీన్ ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన ప్రభంజనం లోకల్ బాడీ ఎన్నికల దాకా కొనసాగడం అంటే గ్రేటే మరి. తాజాగా మినీ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా విజయం తమదే అని వైసీపీ ధీమాగా ఉంది. ఒక విధంగా ఇన్నేసి విజయాలు లభించినపుడు నాయకులు హాయిగా తడి గుడ్డ వేసుకుని పడుకోవాలి. కానీ వైసీపీలో ఆ పరిస్థితి ఉందా అన్నదే ఇక్కడ చర్చ.
ఇక 2019 ఎన్నికల్లో విజయం దాకా చూస్తే వైసీపీ చేసింది అద్భుతమైన ప్రదర్శనే అని అంతా అంగీకరిస్తారు. అయితే ఆ తరువాత అధికారంలో ఉంటూ ఫేస్ చేసిన ఉప ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలు కానీ జనం మనసులోని నిజమైన మాట చెబుతాయా అన్నదే అతి పెద్ద సందేహం. సహజంగా అధికార పార్టీకి ఉప ఎన్నికలు కాట్ వాక్ లాంటివి. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంటుంది అంటే ఎటూ అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తే కాస్తా అభివృద్ధి అయినా జరుగుతుంది అనుకుంటారు. ఆ విధంగా ఓట్లు,సీట్లు దక్కవచ్చు ఇదే నిజమైన ప్రజాభిప్రాయమా అంటే అసలు కాదు అనే చెప్పాలి. అదే నిజమైతే తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నపుడు జయలలిత లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరించింది. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె విజయఢంకా మోగించింది. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం దక్కినా కూడా డీఎంకే జనరల్ ఎలెక్షన్స్ లో ఎందుకు చతికిలపడినట్లు.
అంటే రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఎపుడూ జనం ఆలోచనలు ఓటింగూ వేరేగా ఉంటాయన్నమాట. ఇపుడు అదే బెంగ వైసీపీలో పట్టుకుంది అంటున్నారు. నిజానికి వైసీపీకి ప్రజా వ్యతిరేకత తెలిసే అవకాశం ఈ రోజుకీ రాలేదు. అలా విపక్షాన్ని పూర్తిగా టార్గెట్ చేసి కార్నర్ చేసేసింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అలా కాకుండా పూర్తి స్వేచ్చగా పారదర్శకంగా లోకల్ బాడీ ఎన్నికలు జరిపించి ఉంటే విపక్షం అసలు బలం ఏంటో వైసీపీ కళ్లారా చూసి తెలుసుకునే వీలు ఉండేదన్న సూచనలూ ఉన్నాయి. ఇపుడు నూటికి తొంబై శాతం సీట్లూ ఓట్లూ మావే అని మురిసిపోతున్న వైసీపీ 2024లో మరో సారి 151 సీట్లతో తమదే అధికారం అని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలదా అంటే జవాబు నిల్ అంటున్నారు.
వచ్చే ఎన్నికలు చాలా కీలకం. పైగా అవి అలా ఇలా జరిగే చాన్స్ అసలు లేదు. ఒక విధంగా వైసీపీ విజయాలనే జనం కూడా జీర్ణించుకుని ఒకే పార్టీకి అన్ని విజయాలా అంటూ మార్పు కోరుకుంటే మాత్రం ఫ్యాన్ పార్టీకి చుక్కలు కనిపించడం ఖాయమే. ఇక ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకత లేదా అంటే అది ఓట్ల సీట్ల రూపంలో కనిపించకపోవచ్చు. కానీ ప్రజల ఆందోళనలు, నిరసనలు, ఇతర రూపాల్లో కనిపిస్తోంది అంటున్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అనంతపురం లో మీడియా మీటింగ్ లో విద్యార్ధి సంఘాలు చొచ్చుకువచ్చిన దాన్ని బట్టి చూస్తే జనాల మూడ్ ఏంటి అన్నది కొంత అయినా అర్ధమవుతుంది కదా. అలాగే ఉద్యోగ సంఘాల మౌన రాగాల వెనక ఉన్న నిరసనలు కూడా చూసే మూడవ కన్ను ఉంటే తప్పకుండా కనిపిస్తాయని అంటున్నారు.
అభివృద్ధి ఏ కోశానా లేదు, అప్పుల ఆంధ్రాగా పరిస్థితి ఉంది. దాంతో చాలా వర్గాలకు ఆగ్రహం ఉంది. దాన్ని కూడా గమనిస్తే చేయాల్సిన పనులేంటో వైసీపీకి గుర్తుకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఈ రోజుకీ ఓడినట్లు కాదు, ఇంకా సర్దుకునేందుకు చాలా టైమ్ ఉంది. అన్నీ గెలిచేశాం, మాదే మరో ఇరవయ్యేళ్ల పాటు అధికారమని జబ్బలు చరచుకోకుండా నిఖార్సుగా నిజాయతీగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ తప్పొప్పులు దిద్దుకుంటే మాత్రం కచ్చితంగా మరో మారు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్నికల లెక్కలతో మురిసిపోతూ ఆ రంగు కళ్ళద్దాలతో అంతా బాగుందని సంబరపడితే మాత్రం యమ డేంజరే అంటున్నారు అంతా.