భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో ప్రజల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబుకుతోంది. ఈ క్రమంలోనే వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు వెళుతున్న ప్రజాప్రతినిధులపై తిరుగబడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై స్థానికులు దాడి చేసినట్టు సమాచారం. కార్పొరేటర్ తో స్థానికులు తీవ్ర వాగ్వాదం పెట్టుకున్నారు.హయత్ నగర్ రంగనాయకుల గుట్టలో నాలా భూములన్నీ కబ్జాలకు గురి అవుతున్నాయని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కార్నొరేటర్ సామ తిరుమలరెడ్డిని స్థానికులు నిలదీశారు.
వర్షాలకు ఇళ్లలోకి నీరు రావడంతో ఇండ్లు మునిగిపోతున్నాయని.. నాలా భూముల కబ్జాల వల్లే ఇలా జరిగిందని కార్పొరేటర్ కాలర్ ను పట్టుకున్నారు. చర్చి దగ్గర ఉన్న నాలా కబ్జాకు గురైందని ఇన్ని రోజులు చెబుతుంటే ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఈ ఘటన సంచలనమైంది. హైదరాబాద్ లో ప్రజల కష్టాలకు అద్దం పడుతోంది.