ప్రపంచం మొత్తంలో ఉన్న రూల్స్ వేరు. ముస్లిం దేశాలలో ఉన్న రూల్స్ వేరు. ఆ దేశాలలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందులో సౌదీ అరేబియాలో అయితే చిన్న తప్పుకే చాలా కఠినంగా శిక్షిస్తారని పేరుంది. అలాంటి దేశం కూడా ఇప్పుడిప్పుడే తమ చట్టాలను కూడా మారుస్తుంది. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటిసారిగా విదేశీయులకు వీసాలు జరీ చేస్తున్నామని, 49 దేశాల ప్రజలు ఆన్ లైన్ లో టూరిస్ట్ వీసాల కోసం అప్లై చేసుకోవచ్చని సౌదీ పేర్కొంది.
అంతేకాకుండా తమ దేశానికి వచ్చే విదేశీయులు ఆడ, మగ కలిసి ఒకే రూమ్ లో కలిసి ఉండొచ్చని, వాళ్ళకి ఏం రిలేషన్ లేకపోయినా తమ దేశానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. సౌదీ పౌరులలో ఆడవాళ్లు తమ బంధువులతో కానీ, ఒంటరిగా కానీ హోటల్ రూమ్స్ లో ఉండొచ్చు కానీ వాళ్ళు తమ గుర్తింపు కార్డు చూపించాలని అక్కడి టూరిజం శాఖ స్పష్టం చేసింది. విదేశీయులకు మాత్రం ఈ నింబంధన ఉండదని చెప్పింది.