పీఏకు ఘాట్ లిప్ కిస్.. పదవి పోగొట్టుకున్న మంత్రి

Update: 2021-06-27 08:30 GMT
కరోనా కల్లోలంలో అసలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికే జనాలు హడలి చస్తున్నారు. ఇలాంటి టైంలో అపరిచితులను.. అదీ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటే ఏమవుతుంది..? అదీ స్వయంగా ఓ దేశ మంత్రి చేస్తే ఏం జరుగుతుంది? ఆయన పోస్ట్ ఊస్ట్ అయ్యింది.

కరోనా కఠిన ఆంక్షల మధ్య సోయి మరిచి తన పీఏతో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ బ్రిటన్ మంత్రి. ఆ మంత్రి రోమాంటిక్ యాంగిల్ ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ప్రజలు దీనిపై మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చెలరేగాయి. దీంతో చివరకు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్  రాజీనామా చేయాల్సి వచ్చింది.

బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి, ఆయన పీఏతో చేసిన రోమాన్స్ చివరకు ఆయన పదవికే ఎసరు తెచ్చింది. ఇదివరకే పెళ్లి అయిన హాంకాక్ ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్ గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో ‘పీఏతో ఆరోగ్యమంత్రి రాసలీలలు’ అంటూ ‘ది సన్ పత్రిక’ ప్రముఖంగా ఆ ముద్దుల ఫొటోలను  ప్రచురించింది. ఇది బ్రిటన్ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఫొటోలు మే 6 నుంచి మే 11 మధ్య ఆయన కార్యాలయంలోనే తీసినవి అని సమాచారం. ఈ ఫొటోలను పత్రిక ఎలా సంపాదించిందో మాత్రం వెల్లడించలేదు.

ఇక హాంకాక్ నియమించుకున్న మహిళ 2000 సంవత్సరంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారని.. ఆమెను పోయిన నెలలోనే ఇన్ కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తెలిసింది.
Tags:    

Similar News