ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నది. ముఖ్యంగా మనదేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. రోజులకు వేల మంది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయలేదంటూ అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే వ్యాక్సినేషన్‌కు పేటెంట్ ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదన్నది కొందరు వాదన. అసలు పేటెంట్ అంటే ఏమిటి? అత్యవసర పరిస్థితుల్లో దానికి మినహాయింపు ఉంటుందా? తదితర విషయాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ అత్యవసరం దాని వల్ల మరణాలు రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాక ఆస్పత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మనదేశంలో ఆస్పత్రులు నిండుకున్నాయి. కోవిడ్ రోగులకు బెడ్లు దొరకడం లేదు. కొంతమందికి ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మినహా వేరే మార్గం లేదు. మనదేశంలో ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే అవకాశం లేదు. అందుకు ముఖ్యకారణం పేటెంట్ లేకపోవడమే. వ్యాక్సిన్లపై పేటెంట్ తొలగించాలంటూ ఇటీవల అమెరికా సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ చాలా దేశాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.
పేటెంట్ అంటే ఏమిటి?
ఏదైనా ఓ కంపెనీ కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ గానీ కొత్త మందును కనిపెట్టిన తర్వాత వాటి ట్రయల్స్ అన్ని ముగిసిన తర్వాత వాటికి ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయి. అనంతరం సదరు కంపెనీలు తయారుచేసిన మందులకు పేటెంట్ వస్తుంది. అంటే ఒక్కసారి పేటెంట్ హక్కులు వచ్చాక.. సదరు కంపెనీ తయారుచేసిన ఫార్ములాను ఇతర కంపెనీలు వాడుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే అత్యవసర పరిస్థితుల్లో .. పెద్ద మొత్తంలో మందులు ఉత్పత్తి చేసే సందర్భంలో ఈ పేటెంట్ హక్కులకు మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఆ డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది.
అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు అలా వీలు కాదని తేల్చిచెప్పాయి. అయితే ఇటీవల అమెరికా ఇందుకు అంగీకరించింది .. కానీ ఇతర దేశాలు మాత్రం అంగీకరించలేదు. అయితే పేటెంట్ హక్కులు తొలగించడం అంత మెరుగైన పరిష్కారం కాదని కొన్ని దేశాలు, సంస్థలు అంటున్నాయి. అయితే పేటెంట్ హక్కలు తొలగించాలని ప్రస్తుతం డిమాండ్ గట్టిగానే వినిపిస్తున్నది. ఈ డిమాండ్ సజీనంగా ఉంటుందా? లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ అత్యవసరం దాని వల్ల మరణాలు రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాక ఆస్పత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మనదేశంలో ఆస్పత్రులు నిండుకున్నాయి. కోవిడ్ రోగులకు బెడ్లు దొరకడం లేదు. కొంతమందికి ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మినహా వేరే మార్గం లేదు. మనదేశంలో ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే అవకాశం లేదు. అందుకు ముఖ్యకారణం పేటెంట్ లేకపోవడమే. వ్యాక్సిన్లపై పేటెంట్ తొలగించాలంటూ ఇటీవల అమెరికా సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ చాలా దేశాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.
పేటెంట్ అంటే ఏమిటి?
ఏదైనా ఓ కంపెనీ కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ గానీ కొత్త మందును కనిపెట్టిన తర్వాత వాటి ట్రయల్స్ అన్ని ముగిసిన తర్వాత వాటికి ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయి. అనంతరం సదరు కంపెనీలు తయారుచేసిన మందులకు పేటెంట్ వస్తుంది. అంటే ఒక్కసారి పేటెంట్ హక్కులు వచ్చాక.. సదరు కంపెనీ తయారుచేసిన ఫార్ములాను ఇతర కంపెనీలు వాడుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే అత్యవసర పరిస్థితుల్లో .. పెద్ద మొత్తంలో మందులు ఉత్పత్తి చేసే సందర్భంలో ఈ పేటెంట్ హక్కులకు మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఆ డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది.
కోవిడ్ వ్యాక్సీన్, దానికి సంబంధించిన ఔషధాలపై పేటెంట్లను తొలగించమని భారతదేశం, దక్షిణ ఆఫ్రికా నేతృత్వంలో కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు గత ఏడాది ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు ప్రతిపాదన చేశాయి.