ఇస్రో సైంటిస్ట్ హత్యను ఛేదించిన పోలీసులు

Update: 2019-10-06 08:37 GMT
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలతోపాటు స్వలింగ సంపర్కమే సురేష్ హత్యకు దారితీసిందని పోలీసులు తేల్చారు.

శాస్త్రవేత్త సురేష్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. అమీర్ పేటలోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ కు అక్కడే అమీర్ పేటలోని ధరంకరం రోడ్ లోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్ లో ఉంటున్న సైంటిస్ట్   సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ స్వలింగ సంపర్కం చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఇక సైంటిస్ట్ నుంచి  డబ్బులు బాగానే తీసుకున్నాడు శ్రీనివాస్. అయితే ఆశించిన స్థాయిలో డబ్బు రాకపోవడంతో సురేష్ ను ఆవేశంలో శ్రీనివాస్ హత్య చేశాడని వెస్ట్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. హత్య చేసిన విధానం గురించి నిందితుడు శ్రీనివాస్ గూగుల్ సెక్స్ లో వెతికినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం తర్వాత ఆర్థిక లావాదేవీలు వికటించి ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తేల్చారు
Tags:    

Similar News