ముద్దు పెట్టించుకుని కేసు లేకుండా వదిలేసిన పోలీస్.. అసలు ట్విస్ట్ ఇదే!

Update: 2021-02-20 23:30 GMT
కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు పోలీసులు లంచం తీసుకొని కేసు పెట్టకుండా అక్కడే దానికి పరిష్కారం చూపిస్తుంటారు. అయితే , ఈ పోలీస్ మామూలోడు కాదు లంచానికే కొత్త నిర్వచనం చెప్పాడు.  ఓ మహిళను బెదిరించి..‘నీమీద కేసు పెట్టుకుండా ఉండాలంటే నాకు ఓ ముద్దు పెట్టు..లేదంటే కేసు రాసి లోపలేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె వేరే దారి లేక ఆ పోలీసోడికి ముద్దు పెట్టింది. పైగా అది మామూలు ముద్దు కాదు లిప్ కిస్’ పెట్టింది. దీంతో ఆ పోలీసు ఏదో ఏనుగెక్కినంత సంబరపడిపోతూ ఆమెను వదిలేశాడు.

కానీ, చేసిన పాపం ఎక్కడికిపోదు కదా, చివరికి దొరికిపోక తప్పలేదు. సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోక తప్పలేదు. సాధారణంగా పోలీసులు లంచాలు తీసుకుంటారని తెలిసిందే. డబ్బులో లేదా మందు బాటిల్సో, గోల్డో తీసుకుంటారు. కానీ,పెరూలో కరోనా నిబంధనలు అతిక్రమించి రాత్రి సమయంలో బైటకు వచ్చిన ఓ మహిళను అడ్డగించిన ఓ పోలీసు రూల్స్ బ్రేక్ చేసి బైటకొచ్చినందుకు నీమీద కేసు పెడతా..కానీ కేసు పెట్టకుండా ఉండాలంటే నువ్వు నాకు ఓ ముద్దు పెట్టు నిన్ను వదిలేస్తా, లేదంటే కేసు పెట్టి జరిమానా వసూలు చేయటమే కాదు లోపలేస్తానని బెదిరించాడు. దీంతో పాపం ఆమె కేసు నుంచి బైటపడటానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పోలీసుకు లిప్ కిస్ పెట్టింది.

అయితే ఆ ముద్దు పెట్టిన ప్రాంతంలో ఓ సీసీ కెమెరా ఉండడంతో ఆ పోలీసోడి బండారం బట్టబయలైంది. ఈ వీడియోను అక్కడి ఓ టీవీ చానల్ ప్రసారం చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు అతనిపై మండిపడ్డారు. ముక్క చీవాట్లు పెట్టి అనంతరం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అలాగే రూల్స్ బ్రేక్ చేసినందుకు సదరు మహిళపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Tags:    

Similar News