గంటా ఎంట్రీపై విశాఖలో వైసీపీ నాయకుల నిరసన

Update: 2020-08-06 17:32 GMT
తమ ప్రియమైన శత్రువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాకను వైసీపీ నాయకులు కాస్త గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్టు తేటతెల్లమైంది. టీడీపీ సీనియన్ నేత గంటా ఆగస్టు 16న వైసీపీలో చేరికకు ముహూర్తం కుదిరిందనే వార్తలు వచ్చాయి. దీంతో విశాఖలోని వైసీపీ క్యాడర్ లో సెగలు, పొగలు బయటపడుతున్నాయి.

వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మరో పది రోజుల వ్యవధిలో వైయస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా వర్గాలలో బలమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి ముందు అధికార పార్టీలో తుఫాను చెలరేగింది.. ఇప్పటికే గంటా ప్రవేశాన్ని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గంటాను చేరకుండా తన చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఆయన వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు వైసిపి దిగువ స్థాయి నాయకులు.. కార్మికులు అంతా గంటాకు వ్యతిరేకంగా ఏకమైనట్టు తెలుస్తోంది. వైజాగ్‌లో గంటాకు వ్యతిరేకంగా తాజాగా నిరసన వ్యక్తమైంది. విశాఖలోని చిన్నపురంతోపాటు వి.ఎం.పాలెం వద్ద గంటాకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి. వైసిపి కార్యకర్తలు తమ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు. గంటాను పార్టీలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశఆరు..

మంత్రి అవంతి నియోజకవర్గమైన భీమిలీలో కూడా నిరసన ప్రదర్శన జరగడం విశేషం. పార్టీకి బయటి వ్యక్తులను ఆహ్వానించడం కంటే పార్టీ మద్దతుదారుల మనోభావాలకు విలువ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు తెలిపారు.

మీడియా నివేదికల ప్రకారం..గంటా ఆగస్టు 16 న వైసిపిలో చేరే అవకాశం ఉంది. ఈ విషయంలో సీఎం జగన్... ఆయన రాకను వ్యతిరేకిస్తున్న విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి ఇద్దరినీ విస్మరిస్తున్నారని, గంటా కోసం పార్టీ ద్వారాలు తెరవడానికి సిద్ధమయ్యారని అంటారు. మరి ఇంత వ్యతిరేకత మధ్య గంటా చేరిక ఏ మలుపు తిరుగుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News