దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు చాలా మంది కుమారులు, కూతుళ్లు. అందరినీ మంచిగానే ఎన్టీఆర్ సెటిల్ చేశాడు. అటు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా.. ఇటు ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్.. కొడుకులు, కూతుళ్లకు ఆస్తులు, అంతస్తులు, మంచి సంబంధాలు ఇవ్వడంలో వెనుకాడలేదు. కూతుళ్లను ఏరికోరి మంచి సంబంధాలు వెతికి మరీ పెళ్లి చేశాడు. అయితే ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరి (52) తాజాగా ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో విషాదం నింపింది.
ఉమామహేశ్వరిది సహజ మరణం కాదని.. తన చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయారని తెలుస్తోంది. మానసిక ఒత్తిడి.. అనారోగ్య సమస్యల కారణంగానే ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం.
ఇక తన సోదరి మరణవార్త తెలిసిన వెంటనే సినీ హీరో బాలయ్య ఆమె ఇంటికి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు.
ఉదయం భర్తను టిఫిన్ చేయమని చెప్పి గదిలోకి వెళ్లి ఉమామహేశ్వరి ఆ తర్వాత గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. భర్త టిఫిన్ తీసుకొచ్చే సమయంలో లోపలకు వెళ్లి తలుపుకు బోల్డ్ పెట్టుకున్న ఉమా మహేశ్వరి ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పోస్టుమార్టం తర్వాతనే ఆమె ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు అందే అవకాశముంది..
ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చింది.? ఆరోగ్య సమస్యల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనేది అనుమానిస్తున్నారు.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి జీవితం ఆది నుంచి అల్లకల్లోలంగానే సాగింది. ఉమా మహేశ్వరిని నరేంద్రరాజన్ అనే వ్యక్తికి ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేశాడు. అయితే ఆయన చాలా సాడిస్ట్ గా ప్రవర్తించేవాడని.. సిగరెట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ల నాన్న అయినా.. ఎన్టీఆర్ కు అప్పట్లో చెప్పింది. దీంతో అతడితో విడాకులు ఇప్పించిన ఎన్టీఆర్ ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం అతడితోనే ఉమామహేశ్వరి జీవిస్తోంది. అనారోగ్య కారణాలు, ఒంటరితనం, మానసిక ఒత్తిడి వల్లే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.