జగన్‌ తో క్రికెటర్ల కలయిక అందుకేనా?

Update: 2023-06-16 10:59 GMT
ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం లోకి రావడానికి వైసీపీ అన్ని అవకాశాల పై దృష్టి సారించింది. ముఖ్యంగా వివిధ రంగా లకు చెందిన వ్యక్తులను ఆకర్షిస్తోంది. వారి ద్వారా తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని చెప్పించడం ద్వారా అన్ని వర్గాలు, అన్ని రంగాల మద్దతు తమకుందని చెప్పుకోవడం వైసీపీ ఉద్దేశంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఖచ్చితంగా ఎన్నికల వేళే.. ఏపీ కి చెందిన క్రికెటర్లు అంబటి రాయుడు, కోన శ్రీకర్‌ భరత్‌ (కేఎస్‌ భరత్‌) వేర్వేరుగా సీఎం వైఎస్‌ జగన్‌ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం అంబటి రాయుడు తన కుటుంబంతో సీఎం జగన్‌ ను కలిశాడు. ఇక ఇప్పుడు తాజాగా కేఎస్‌ భరత్‌ తన కుటుంబంతో కలిసి భేటీ అయ్యాడు.

అందులో నూ అంబటి రాయుడు, కేఎస్‌ భరత్‌ ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారని చెబుతున్నారు. తద్వారా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చనేది జగన్‌ ఆలోచన అని అంటున్నారు.

ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీమ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ తాజాగా అధికారుల ను ఆదేశించారు. ఇందుకు అంబటి రాయుడు, కోన భరత్‌ ల సేవలు వినియోగించుకోవాల ని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇక అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. అంబటి రాయుడు ను గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయించొచ్చని ప్రచారం జరుగుతోంది. లేక పోతే గుంటూరు పశ్చిమ నుంచి అ సెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు.

కేఎస్‌ భరత్‌ కంటే ముందు మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు సీఎం జగన్‌ ను కలిసింది కూడా పూర్తిగా రాజకీయ కారణాలతోనేన ని అంటున్నారు. క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత రాయుడు రాజకీయాల్లోకి రావాల ని భావించాడని చెబుతున్నారు. తనకు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని అంబటి రాయుడు జగన్‌ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

కోన భరత్‌ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తోనే సీఎం జగన్‌ ను కలిశాడని ప్రచారం సాగుతోంది. వైసీపీ కూడా వీరిని తమ ప్రయోజనాల నేపథ్యంలో ప్రోత్సహిస్తోంది. తమ ప్రభుత్వానికి అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రముఖుల మద్దతు ఉందని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది.

Similar News