తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటే అన్నట్లుగా ఉంటోంది ఏపీ సర్కారు తీరు. ఇరుగుపొరుగు రాష్ట్రాలే కావొచ్చు.. కరోనా విషయంలో ఏ మాత్రం రిస్కు తీసుకునేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. కరోనా విషయంలో మాత్రం రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పాలి. ఏపీకి ఇరుగుపొరుగు ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో మాదిరి సిస్టమాటిక్ గా జరగటం కనిపించదు.
తాజాగా ఏపీ సర్కారు మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ఏపీకి వచ్చే తెలంగాణ.. కర్ణాటక వాసులు తప్పనిసరిగా సరిహద్దుల్లో పరీక్షలు చేయించుకున్న తర్వాతే.. తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య.. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ..కర్ణాటక రాష్ట్రాల్ని రిస్కు రాష్ట్రాలుగా తేల్చిన ఏపీ సర్కారు.. ఆ రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పీక్స్ కు చేరుకోవటంతో అలెర్టు అయ్యింది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సంబందించిన క్వారంటైన్ విధించే విధానంలోనూ సరికొత్త నిర్ణయాల్ని తీసుకున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తేల్చారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు గతంలో మాదిరి 14 రోజులు కాకుండా ఏడు రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చే వారికి ఐదో రోజు.. ఏడో రోజు కోవిడ్ టెస్టులు చేయాలి. అదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల్లో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కనీసం పది శాతం మంది ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేశారు. ఎయిర్ పోర్టుల్లో స్వాబ్ పరీక్షలు.. రైళ్లద్వారా వచ్చే వారికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారంతా పద్నాలుగు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి చేశారు. రోడ్డు మార్గాన వచ్చే వారికి మాత్రం రాష్ట్ర సరిహద్దుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ.. ఈ పరీక్షల్లో పాజిటివ్ కానీ వస్తే వారిని కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కోవిడ్ ఎపిసోడ్ లో ఎలాంటి మొహమాటం లేకుండా..విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏపీ ముందుందని చెప్పాలి.