తప్పు చేస్తే ప్రశ్నించు.. నిలదీయు అని చెబుతారు. కానీ.. ఆ మాటను వంట పట్టించుకొని అడగటం మొదలు పెడితే.. ఎవరికి వారు ఏ స్థాయికి ఆ స్థాయి వారు ఉక్కిరిబిక్కిరి అవుతారు. తమకున్న అధికారాన్ని తమకు చేతనైన రూపంలో ప్రదర్శించటం మొదలు పెడతారు. కొందరు సున్నితంగా చెబితే.. మరికొందరు కఠినంగా చెబుతుంటారు.
ఇంకొందరు క్రూరంగా వ్యవహరిస్తుంటారు. తాజా ఉదంతం మూడో కోవకు చెందింది. బీహార్ లోని ఒక మహిళ ప్రశ్నించినందుకు ఆమెకు దారుణమైన శిక్ష పడింది. విన్నంతనే గగుర్పాటుకు గురయ్యే ఆ ఉదంతంలోకి వెళితే..
బిహార్ లోని సుపాల్ జిల్లాకు చెందిన లోధ్ గ్రామానికి సర్పంచ్ ముస్తాకిన్. సాధారణంగా సర్పంచ్ అన్నంతనే గ్రామానికి పెద్ద. అందరి బాధల్ని.. కష్టాల్ని తనవిగా ఫీల్ అవుతూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. కానీ.. ముస్తాకిన్ తీరు కాస్త భిన్నం. తమ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల్ని వేధిస్తున్నాడు.
వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో.. అతడి వేధింపుల్ని భరించలేని వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.
తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఊహించని పరిణామానికి తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్.. ధర్నా చేస్తున్న ముగ్గురు అమ్మాయిల మీద దాడి చేశారు. అంతేకాదు.. తమకు న్యాయం చేయమని కోరిన దానికి మండిపడుతూ.. ధర్నా చేస్తున్న ముగ్గురిలో ఒక అమ్మాయి ముక్కు కోసేశాడు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్నారు. గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
ముక్కు కోసిన సర్పంచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబానికి చెందిన వారు. ఇదిలా ఉంటే.. తన మీద కంప్లైంట్ చేసిన మహిళ కుటుంబం మీద సర్పంచ్ తిరిగి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి మీదకు దాడి చేసినట్లుగా అందులో పేర్కొన్నాడు. అసలు.. అమ్మాయిల్ని వేధింపులకు గురి చేయకపోతే.. వారు అతని ఇంటి ఎదుట ఆందోళన చేయాల్సిన అవసరమే వచ్చేది కాదు కదా? అధికారం చేతిలో ఉన్నోళ్లు ఏమైనా చేయొచ్చన్న దానికి నిదర్శనంగా ఈ ఇష్యూను చెప్పొచ్చు.