పశ్చిమబెంగాల్ లో జై శ్రీరాం నినాదం అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. బీజేపీ నేతలకు ఒళ్లు పులకరించిపోయేలా చేస్తోంది. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికలు నువ్వా నేనా? అన్నట్లు సాగుతోంది. ఇలాంటి వేళ.. రాజకీయ ప్రయోజనం పొందే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు రెండు పక్షాలు. ఎన్నికల ప్రచారంలో జైశ్రీరాం అన్న మాటను బీజేపీ సీరియస్ గా తీసుకుంటే.. అధికార మమత బ్యాచ్.. ఆ నినాదమే వినిపించకుండా ఏం చేయాలని తెగ ప్రయత్నిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. జైశ్రీరాం అన్న మాటకు బీజేపీ నేతలు.. కార్యకర్తలు భావోద్వేగంతో ఊగిపోతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే.. సదరు నినాదానికే ఎసరు తీసుకురావాలి. ఇందులో భాగంగా.. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో జై శ్రీరామ్ అన్న మాటను వాడకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ.. దీనికి సంబంధించిన పిటిషన్ పై మొదట కలకత్తా హైకోర్టులకు వెళ్లాలన్న సూచన చేసింది.
ఈ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది శర్మ స్పందిస్తూ.. తాను దాఖలు చేసింది ఎన్నికల పిటిషన్ కాదని.. ఒక పార్టీ మతపరమైన నినాదాల్ని చేస్తుందని.. అందుకు తాను ఎందుకు హైకోర్టుకు వెళ్లాలంటూ సుప్రీం బెంచ్ ను రివర్సులో ప్రశ్నించారు లాయర్ శర్మ. దీనికి రియాక్టు అయిన సుప్రీం బెంచ్.. సదరు లాయర్ వాదనతో తాము ఏకీభవించటం లేదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో జైశ్రీరాం అన్న నినాదాన్ని వినియోగించొచ్చు అన్న విషయాన్ని సుప్రీం తన తాజా తీర్పుతో చెప్పేసింది. ఇది దీదీకి మరింత ఇరిటేషన్ కలిగేలా చేస్తోంది.
మొండి మోడీ.. జగమొండి దీదీ నడమ అసెంబ్లీ ఎన్నికల పోరు ఎంత తీవ్రంగా ఉందన్నది తెలిసిందే. దీదీకి ఏ విషయంలో అయితే ఇరిటేట్ అవుతారో.. సరిగ్గా అదే అంశాన్ని టచ్ చేస్తూ చికాకు తెప్పిస్తున్నారు. అయితే.. మమత ఈ విషయాన్ని మిస్ అవుతూ బీజేపీ పన్నిన ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వాస్తవానికి దీదీ.. జైశ్రీరాం నినాదానికి వ్యతిరేకం కాకున్నా.. తాజా పరిణామాలు ఆమె వ్యతిరేకి అన్న భావన కలిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇప్పటికైనా దీదీ.. అనవసరమైన విషయాల్లో ఇరిటేషన్ తగ్గించుకుంటారో లేదో చూడాలి.