మనిషి తీరు అస్సలు అంచనా వేయలేం. మంచి జరగాలంటూ నిర్దాక్షిణ్యంగా జంతుబలులు ఇచ్చేస్తుంటాడు. మరోవైపు తనకు కనెక్టు అయిన పశుపక్ష్యాదుల విషయంలో అపారమైన కరుణను ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు చెప్పే ఉదంతం రెండో కోవకు చెందింది.
ఒక పిచ్చుక మరణం ఒక గ్రామం మొత్తాన్ని ఒక్కటి చేయటమే కాదు..దాని మరణంతో వారు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అందుకే.. దానికి సమాధి కట్టి.. పూజలు చేసి.. సామూహిక భోజనాలు నిర్వహించి.. ‘మళ్లీ తిరిగి రా’ అంటూ పోస్టర్లు వేసిన వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇలా ఎందుకు జరిగింది? పిచ్చుక మరణానికి గ్రామం మొత్తం ఎందుకు తల్లడిల్లిందన్న విషయంలోకి వెళితే..
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిద్దగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో చాలానే పిచ్చుకలు ఉన్నాయి. కానీ.. ఒక పిచ్చుక మాత్రం వారికి ప్రత్యేకం. ఆ పిచ్చుక గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లేది. వారు పెట్టే గింజల్ని తినేది. తర్వాత వెళ్లిపోయేది. అదేం పెద్ద గొప్ప విషయమా? అంటే.. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒక్కో ఇంటికి ఒక్కో టైంలో వెళ్లే ఈ పిచ్చుక.. ఏ ఇంటికి ఏ టైంకు వెళుతుందో.. ప్రతి రోజూ అదే సమయానికి వెళ్లటం దాని ప్రత్యేకత.
గ్రామానికి చెందిన రాయణ్ణ అనుభవాన్నే చూస్తే.. వారింటికి ఈ పిచ్చుక ఉదయం వెళ్లేది. వారింటికి పిచ్చుక వచ్చిందంటే చాలు.. గడియారంలో ఎనిమిది గంటలు అయినట్లు అని పిచ్చుకతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి చెబుతాడు. ఉదయమే.. తమ పిల్లలు ఆ పిచ్చుక కోసం ఎదురుచూస్తుంటారని.. అది వచ్చినంతనే కొన్ని గింజలు వేయటం.. వాటిని శుభ్రంగా తినేసి వెళ్లిపోయేదని రాయణ్ణ చెబుతూ.. ఇక ఎప్పటికి దాన్ని చూడేలమంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇలా గ్రామంలోని అందరికి తలలో నాలుకలా నిలిచిన పిచ్చుకతో ఆ ఊరి వారికి మరో సెంటిమెంట్ ఉండేది. పిచ్చుక నివాసం ఉరి మొదట్లో ఉండేది. దీంతో.. ఎవరైనా బయటకు వెళుతున్నా.. గ్రామంలోకి తిరిగి వస్తున్నా.. దాన్ని చూసేవారు. అది కనిపించిన ప్రతిసారీ మంచి జరిగేదని గ్రామస్తుల భావన. అలాంటి చిట్టి జీవి.. పది రోజులుగా కనిపించకపోవటంతో దాని కోసం వెతకసాగారు. చివరకు అది చనిపోయినట్లుగా గుర్తించారు. తమతో ఎంతో అనుబంధం ఉన్న పిచ్చుక చనిపోవటాన్ని జీర్నించుకోలేని గ్రామస్తులు.. దాన్ని ప్రత్యేకంగా అంత్యక్రియులు చేయటమే కాదు.. దశ దిన కర్మలు నిర్వహించారు. చివరకు ‘తిరిగి రా’ అంటూ పోస్టర్లు వేయించి దాన్నిస్మరించుకున్నారు. పిచ్చుక కోసం ఆ గ్రామస్తులు పడిన ఆవేదన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.