‘మాట’ తేడా ప్రాణాన్ని తీసేసింది. భర్తను కత్తి తో పొడిచి చంపేసిన భార్య వైనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మాటలో వచ్చిన తేడాను ప్రశ్నించిన భార్య.. భర్త తీరుకు తీవ్ర ఆగ్రహానికి గురి కావటం.. ఆగ్రహం.. అంతకు మించిన ఆవేశం తో భర్తను చంపేసే వరకు విషయం వెళ్లింది. స్థానికం గా సంచలనంగా మారిన ఈ ఉదంతం లోకి వెళితే.. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా లోని బుసిరెడ్డి గూడ గ్రామానికి చెందిన 42 ఏళ్ల మురళీధర్ రెడ్డికి.. మౌనిక కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. పదకొండేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చిన వారు సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు ప్రై వేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల ఐదున మౌనిక గుంటూరు వెళ్లారు. ఆరో తేదీని హైదరాబాద్ కు వచ్చారు.
ఇదిలా ఉంటే.. తాను ఊరికి వెళ్లిన సమయం లో తన భర్త తన గురించి చెడుగా ప్రచారం చేసినట్లుగా కొడుకు ద్వారద తెలుసుకున్న ఆమె.. మురళీధర్ రెడ్డిని నిలదీసింది. తన నడవడిక మీద స్థానికుల వద్ద చెడుగా మాట్లాడిన తీరు పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో.. భార్య భర్తల ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త మాటలతో విసిగి పోయిన మౌనిక.. తీవ్ర ఆగ్రహానికి గురై.. ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తో భర్త మెడపైన పొడిచింది.
దీంతో మురళీధర్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. భర్త చని పోయిన వైనాన్ని గుర్తించిన మౌనిక.. నేరు గా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగి పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘మాట’ బలి తీసుకుంటుందన్న నానుడికి తగ్గట్లే తాజా ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం.