వైసీపీలో నెంబర్ 1 ఒక్కటే ..నెంబర్ 2 లేదు : వైవి సుబ్బారెడ్డి!

Update: 2020-07-06 07:50 GMT
ఏపీలో అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కరోనా పై పోరాడుతూనే ..మరోవైపు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టింది. ప్రజాసంక్షేమమే ద్యేయంగా అధికారంలోకి వచ్చి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతుంది.

అయితే చాలా రోజులుగా వైసీపీలో వినిపిస్తున్న మాట వైసీపీ అధినేత సీఎం జగన్ పార్టీలో నెంబర్ వన్ అయితే మరి నెంబర్ 2 ఎవరు ? అయితే దీనిపై అనేక రకమైన వాదనలు వినిపిస్తుంటాయి. తాజాగా దీనిపై టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. మా పార్టీలో నెంబర్ 2 ఎవరూ లేరు - నెంబర్ 1 ఒక్కటే - నెంబర్ 1 జగన్ గారు ఆ తర్వాత కార్యకర్తలే మా బలం అంటూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
Tags:    

Similar News