సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడి, ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, ఆన్ లైన్ రమ్మీ, పోకర్ పై నిషేధం, ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణం వంటి కీలక అంశాలతోపాటు పలు విషయాలు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చాయి. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతన్నలకు మేలు చేకూర్చే `ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం`కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులపై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సమాజంలో పలువురిని చెడు వ్యసనాలబారిన పడేలా చేస్తున్న ఆన్‌లైన్ గేమ్స్ పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద సంబంధ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష విధించాలని కేబినెట్ తీర్మానించింది. రెండోసారి తప్పు చేస్తే రెండేళ్లు జైలు శిక్ష విధించనుంది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నగదు బదిలీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు కేటాయించింది. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఏపీలోని లక్ష అనధికార ఉచిత విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం వర్తింపజేయాలని తీర్మానించింది. విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని కేబినెట్ నిర్ణయించింది.
గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్(డీడీవో) పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్ ఇచ్చి ఆ సోస్టులలో భర్తీకి ఆమోదం తెలిపింది. స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. రూ.2565 కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1350 కోట్ల వ్యయంతో ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి పైన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.1273 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే, డీటైల్డ్ ప్రొజెక్ట్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిసింది. రూ.15389.80 కోట్ల అంచనాలతో బాబు జగజ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. .ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులతో పాటు పలు రాడికల్ సంస్థలపై మరో ఏడాది నిషేధం విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సమాజంలో పలువురిని చెడు వ్యసనాలబారిన పడేలా చేస్తున్న ఆన్‌లైన్ గేమ్స్ పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద సంబంధ గేమ్స్ ఆడేవాళ్లకు 6 నెలలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష విధించాలని కేబినెట్ తీర్మానించింది. రెండోసారి తప్పు చేస్తే రెండేళ్లు జైలు శిక్ష విధించనుంది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నగదు బదిలీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు కేటాయించింది. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఏపీలోని లక్ష అనధికార ఉచిత విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం వర్తింపజేయాలని తీర్మానించింది. విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని కేబినెట్ నిర్ణయించింది.
గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్(డీడీవో) పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్ ఇచ్చి ఆ సోస్టులలో భర్తీకి ఆమోదం తెలిపింది. స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. రూ.2565 కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1350 కోట్ల వ్యయంతో ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి పైన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.1273 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే, డీటైల్డ్ ప్రొజెక్ట్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిసింది. రూ.15389.80 కోట్ల అంచనాలతో బాబు జగజ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాయలసీమలోని 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనుల పాలనాపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.