అవి ఎందుకు మూయవ్ కేసీఆర్: జగ్గారెడ్డి

Update: 2021-03-24 13:28 GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా విద్యాసంస్థలను మూసివేస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మిగతా రంగాలను కొనసాగించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీనిపై స్పందించారు. విద్యాసంస్థలను మూసివేయడం మంచిదేనని జగ్గారెడ్డి అన్నారు. అదే విధంగా థియేటర్లు, వైన్ షాపులు, పబ్బులు, పార్కులనూ కూడా మూసివేయాలన్నారు. మళ్లీ లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాటిని మూసివేయాలన్నారు.

ఇక పిల్లలు కట్టిన ఫీజుల్లో సగమైనా విద్యాసంస్థలు వెనక్కి ఇవ్వాలని జగ్గారెడ్డి అన్నారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను సర్కారు ఆదుకోవాలని సూచించారు. విద్యాసంస్థలన్నీ తెరిచి తల్లిదండ్రుల నుంచి ఫీజులు తీసుకున్నారని.. వాటిలో కొంచెమైనా తిరిగి ఇవ్వాలని సూచించారు.

అయితే ఇప్పటికే విద్యాసంస్థలను మూసి సర్కార్ థియేటర్లను కూడా మూసివేస్తుందన్న ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సినీ పరిశ్రమ ఎంతో ఇబ్బందులు పడిందని.. మళ్లీ థియేటర్లు మూసివేసే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు.
Tags:    

Similar News