కరోనా బాధితుడి ఇంట్లో మటన్ వండుకొని తిని , ఆ పై దొంగతనం !

Update: 2020-07-22 02:30 GMT
సాధారణంగా దొంగతనం చేయడానికి వెళ్ళినవారు , వెళ్ళామా , వెళ్లిన పని చూసుకున్నామా , వచ్చేసామా ! అని అంతా కూడా క్షణాల వ్యవధిలో జరిగేలా ప్లాన్ చేసుకుంటుంటారు. చోరీ చేయాలి అని డిసైడ్ అయ్యాక ... అంతా ప్లాన్ ప్రకారమే జరిగేలా చూసుకుంటారు. కానీ , తాజాగా ఓ దొంగ ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లి , ఆ ఇంట్లో అన్నం, మటన్ కూర వండుకొని తిన్న అరుదైన ఘ‌ట‌న జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివ‌రాలు చూస్తే .... జార్ఖండ్‌ లోని జంషెడ్‌ పూర్ ‌కు చెందిన ఓ వ్య‌క్తికి జూలై 8న‌ క‌రోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో అత‌ను టాటా మెయిన్‌ ఆస్ప‌త్రి లో కరోనా చికిత్స కోసం జాయిన్ అయ్యాడు. ఆ విషయాన్ని పసిగట్టిన దొంగలు , ఇదే సరైన సమయం అని భావించి అత‌ని ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణ‌యించుకున్నారు. అలాగే, ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్ ‌మెంట్ జోన్‌ గా ప్ర‌క‌టించడం వారికి మ‌రింత క‌లిసొచ్చింది. దీనితో చ‌డీచ‌ప్పుడు కాకుండా దొంగ‌లు గురువారం రాత్రి ఆ ఇంట్లో దూరారు. ముందుగా క‌డుపు నింపుకుందామ‌ని కిచెన్‌ లోకి ప్ర‌వేశించి అన్నం, మ‌ట‌న్ కూర వండుకుని తృప్తిగా తిని, అనంత‌రం ద‌ర్జాగా 50 వేల రూపాయ‌ల‌ను, మ‌రో 50 వేలు విలువ చేసే న‌గ‌ల‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.
Tags:    

Similar News