కరోనా వైరస్ ..తెలుగు రాష్ట్రాల ప్రజలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కరోనా ..తెలుగు రాష్ట్రాలలో కూడా వేగంగానే వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా... లేటెస్ట్‌గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.అలాగే ఇప్పటి వరకూ 966 మందికి అబ్జర్వేషన్ లో ఉంచారు. వారిలో 258 మంది అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్నారు. 677 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మొత్తం 31 మంది ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ 119 కేసుల్లో శాంపిళ్లను టెస్ట్ చేశారు. వీటిలో మొత్తం 3 శాంపిళ్లు పాజిటివ్ గా నమోదు అయ్యాయి. 104 శాంపిళ్లు నెగిటివ్ గా నమోదు అయ్యాయి. అలాగే 12 కేసుల్లో శాంపిల్స్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.
ఇక తాజాగా ఏపీలో మూడో కరోనా పాజిటివ్ కేసును నమోదు చేసారు. విశాఖకు చెందిన వ్యక్తి కొన్ని రోజుల క్రితం మక్కాకు వెళ్లి వచ్చాడు. మక్కా నుండి వచ్చిన తరువాత, అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రిలో చెక్ చేయించుకోగా.. అతనికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీనితో వెంటనే బాధితుడిని బాధితుడికి విశాఖలోని చెస్ట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో మరొకరు కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇకపోతే ,ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠినమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే విద్యాసంస్థలు, స్కూల్స్ కి సెలవులు ఇవ్వగా.. మాల్స్, సినిమా హాళ్లను కూడా మూసివేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో దర్శనాలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా , దేశంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 198 కి చేరింది.